10టీవీ కథనాలకు స్పందించిన ఎంపీ అసదుద్దీన్

హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్‌ నుంచి అసదుద్దీన్ కారు అతి వేగంగా వెళ్లడంతో..

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాడుతున్న కారుపై 10,485 రూపాయల ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ 10టీవీలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో 10టీవీ కథనాలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించి తన కారు చలాన్లకు క్లియర్ చేశారు. హైదరాబాద్ శివార్లలోని ఓఆర్ఆర్‌ నుంచి అసదుద్దీన్ కారు అతి వేగంగా వెళ్లడంతో ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నాయి.

ప్రజా ప్రతినిధులు ఇలా ఓవర్ స్పీడ్ గా వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇటీవలే కథనాలు ప్రచురితమయ్యాయి. ఇన్ని చలాన్లు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నలు తలెత్తాయి.

అసదుద్దీన్‌ ఒవైసీ వాడుతున్న టీఎస్11ఈవీ-9922పై అంతగా చలాన్లు ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిన్న సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి. ఆ వాహనంపై 2021 నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు చలాన్లపై రాయితీ కూడా ప్రకటించిన విషయం విదితమే. అయినప్పటికీ కట్టలేదన్న విమర్శలు వచ్చాయి. చివరకు ఇవాళ అసదుద్దీన్ ఒవైసీ చలాన్లు అన్నింటినీ కట్టారు.

Also Read : లండన్‌లో ప్రమాదవశాత్తూ భారతీయ విద్యార్థిని మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన ట్రక్కు

ట్రెండింగ్ వార్తలు