NRI Jhansi Reddy (1)
Jhansi Reddy – Denied Indian Citizenship : ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత, ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలింది. ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ లక్ష్మీ రెడ్డికి భారత పౌరసత్వం నిరాకరించింది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భావించారు. కానీ, ఆమె భారత పౌరసత్వం నిరాకరించబడింది. ఈ మేరకు అక్టోబర్ 4వ తేదీనే ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భారత పౌరసత్వాన్ని నిరాకరిస్తూ అధికారిక లేఖ విడుదల చేశారు.
అయినా ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాలకుర్తిలో పోటీ చేస్తానంటూ ప్రకటిస్తుండటం గమనార్హం. హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని పాలకుర్తి కాంగ్రెస్ అభర్థిగా పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో ఝాన్సీరెడ్డి స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లకు చేరువయ్యారు. ఆమె సేవా కార్యక్రమాలను గుర్తించిన కాంగ్రెస్ పలిచి టికెట్ఇ స్తామనడంతో ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.
MP Arvind : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఝాన్సీరెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆమె భారత పౌరసత్వాన్ని నిరాకరించారు. అంగ, అర్ధబలంతో ఢీకొట్ట గల సత్తా ఉన్న ఝాన్సీరెడ్డిని బరిలో దింపి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి చుక్కలు చూపించాలని స్కెచ్ వేసిన రేవంత్ రెడ్డి ప్లాన్ వర్క్ అవుట్ అయ్యే పరిస్థితి కనపించడం లేదు.
అయితే, పౌరసత్వ సమస్య తెరమీదకు తెస్తారని ఊహించే ఝన్సీరెడ్డి ముందు నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆమె సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. సకాలంలో భారత పౌరసత్వం వస్తుందో రాదో అన్న సందేహంతో కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని అంటున్నారు. ఎన్నారై ఝాన్సీరెడ్డి తన పౌరసత్వం విషయంలో టెక్నికల్ అంశాలు అడ్డొస్తే తన కోడలు యశస్వినిరెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
మూడేళ్ల క్రితం ఝాన్సీరెడ్డి కుమారుడితో వివాహమైన యశస్వినిరెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. భారత పౌరసత్వం కలిగిన యశస్వినికి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నారై ఝాన్సీరెడ్డి తన తండ్రి మరణం తర్వాత 11 సంవత్సరాల వయసులో 1977లో తల్లితో కలిసి అమెరికాకు వెళ్లారు. 1982లో డాక్టర్ రాజేందర్ రెడ్డిని అమెరికాలో ఆమె వివాహం చేసుకున్నారు.
అయితే భారత పౌరసత్వం విషయంలో ఆమె చాలా ధీమాగా ఉన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పౌరసత్వ సమస్య అడ్డుకాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఝాన్సీరెడ్డి భారత పౌరసత్వాన్ని నిరాకరించారు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సందిగ్ధత నెలకొంది.