×
Ad

KTR : సింగరేణి బతకాలంటే అదొక్కటే దారి- మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR On Singareni : కొత్తగూడెంకు విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నిస్తే మోదీ అడ్డుకున్నారు. మరిన్ని పథకాలు రావాలంటే మరోసారి కేసీఆర్ సర్కార్ రావాలి.

  • Published On : November 19, 2023 / 04:45 PM IST

KTR On Singareni (Photo : Facebook)

తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. పోలింగ్ తేదీ సమయం దగ్గరపడటంతో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో దూకుడు పెంచాయి. ముమ్మరంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీనే గెలిపించాలని ఎవరికి వారు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి కంటిన్యూ అవ్వాలన్నా, మరిన్ని సంక్షేమ పథకాలు రావాలన్నా బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలి, మన తలరాతలు ఎలా మార్చుకోవాలో తేల్చుకునే ఎన్నికలు ఇవి అని ఆయన అన్నారు. అత్యంత సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు కేసీఆర్ నాయకత్వం కోరుతున్నారు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన ప్రాంతాల్లో అగ్రభాగంలో ఉన్న ప్రాంతం కొత్తగూడెం సింగరేణి ప్రాంతం అని కేటీఆర్ అన్నారు. సింగరేణిని మింగేయాలని మోదీ అనుకుంటున్నారు అని ఆరోపించిన కేటీఆర్.. సింగరేణిని కాపాడుకోవాలంటే గులాబీ జెండా వల్లే అవుతుందని తేల్చి చెప్పారు కేటీఆర్.

Also Read : దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత సీఎం ప్రకటన చేయాలి : వైఎస్ షర్మిల

కేసీఆర్ వచ్చాక సాగునీరు, తాగునీరు మారిందని, రాష్ట్రం అభివృద్ధి చెందిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వనమా వెంకటేశ్వరరావు గెలిస్తే నియోజకవర్గ పరిధిలో సంక్షేమ పథకాలు ఆగవు అని ఆయన చెప్పారు. మరిన్ని పథకాలు రావాలంటే మరోసారి కేసీఆర్ సర్కార్ రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. త్వరలోనే అంబసత్రం భూములకు పట్టాలు ఇస్తుందన్నారు. ఇంకా మిగిలి ఉన్న పోడు భూములకు కూడా పట్టాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

”కొత్తగూడెంకు విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నిస్తే మోదీ అడ్డుకున్నారు. కార్యకర్తలు జోష్ చూస్తుంటే మళ్ళీ వనమా గెలుపు ఖాయం అనిపిస్తుంది. సింగరేణి బతకాలంటే, కేసీఆర్ రావాలి. అంటే వనమా గెలిచి తీరాలి. కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు వనమా గెలుపు కోసం కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు కేటీఆర్.

Also Read : తెలంగాణ పోరులో వారసులు విజయం సాధిస్తారా? హోంశాఖ మంత్రుల వారసులకు దక్కని అవకాశం