BRS Vs Congress : చంపేందుకు కుట్ర- శ్రీధర్ బాబు, పుట్ట మధు పరస్పర ఆరోపణలు

Putta Madhu Sridhar Babu Allegations : నన్ను అంతమొందించడానికి కుట్రలో భాగంగా ఒక గ్రూపును తయారు చేశారు. ఇద్దరు మాజీ నక్సలైట్లను ఇతర రౌడీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.

Putta Madhu Sridhar Babu Allegations (Photo : Facebook)

మంథనిలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం ముదిరింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పుట్ట మధు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. నన్ను చంపేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించగా, మాజీ నక్సలైట్లతో తనను అంతమొందించేందుకు కాంగ్రెస్ నేతలు స్కెచ్ వేశారని పుట్ట మధు సైతం ఆరోపణలు చేశారు. ఇరువురు నేతలు పరస్పరం ఒకరిపై మరొకరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసుకున్నారు.

నడిరోడ్డుపై నిల్చుంటా.. నన్ను చంపమనండి- శ్రీధర్ బాబు
మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథని చౌరస్తాలో నడిరోడ్డుపై నిల్చుంటా. బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమనండి అని ఆయన అన్నారు. పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారాయన. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.

పుట్ట మధు గురించి మాట్లాడటం నేరమా?
పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్నకు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలన్నారు. మంథనిలో శాంతియుత ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు తప్ప.. ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయవద్దా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బక్కన్న అనే వ్యక్తి ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకంతో ఒక గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోబడ్డ వ్యక్తి అని శ్రీధర్ బాబు అన్నారు.

Also Read : ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. దళిత సీఎంని చూడలేకపోయాం, బీసీనైనా సీఎంగా చూడాలి : పవన్ కల్యాణ్

మాజీ నక్సలైట్లతో నన్ను చంపేందుకు కుట్ర- పుట్ట మధు
అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు సైతం కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఒక బ్రాహ్మణ కుటుంబం 45 సంవత్సరాలు అధికారంలో ఉంది. నన్ను అంతమొందించడానికి కుట్రలో భాగంగా ఒక గ్రూపును తయారు చేశారు. చంద్రయ్య, బక్కయ్య అనే ఇద్దరు మాజీ నక్సలైట్లను, ఇతర రౌడీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మహాముత్తారానికి బక్కారావు రాత్రి పూట ఎందుకు వెళ్ళారు? ఆయన ఏమైనా స్టార్ క్యాంపెయినరా? తుపాకులు పట్టుకుని కాంగ్రెస్ వాళ్లు తిరుగుతున్నారు.

Also Read : వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం ..! ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఐటీ దాడులు..

రాజకీయంగా నన్ను సమాధి చేయడానికి శ్రీధర్ బాబు ఆలోచిస్తున్నారు- పుట్ట మధు
అధికార పార్టీలో ఉన్న తనపై బక్కారావు ఫిర్యాదు చేయడం, 307 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటి? పోలీసులు ఆలోచన చేయాలి. బక్కారావు ఎన్నికల కమీషన్ కూడా వాడుకుంటున్నారు. ఎన్నికల కమీషన్ ఆలోచించాలి. బక్కారావు మీనాజీపేటకు ఎందుకు వెళ్ళారో తెలిపాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేస్తాం. రాజకీయంగా నన్ను సమాధి చేయడానికి శ్రీధర్ బాబు ఆలోచిస్తున్నారు. పోలీసులు ఈ విధంగా మాపై కేసులు పెడితే ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. కార్యకర్తలు గొడవపడితే నాయకుడిదేనా బాధ్యత” అని పుట్ట మధు సీరియస్ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు