YS Sharmila : వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం ..! ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఐటీ దాడులు..

ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు

YS Sharmila : వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం ..! ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఐటీ దాడులు..

YS Sharmila

Telangana Assembly Elections 2023 : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. వారి ఆటలు మరెన్నో రోజులు సాగవు, ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ములేక అధికారాన్ని వాడుకొని ఐటీ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచే సత్తాలేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు ప్రధాని మోదీ సాయం చేస్తున్నారని, ఎన్ని డ్రామాలు ఆడినా బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసని షర్మిల అన్నారు.

Also Read : Vijayashanthi : కాళేశ్వరం మీకు కాటేశ్వరం అవుతుంది : CM కేసీఆర్‌పై విజయశాంతి మాటల తూటాలు

గల్లీలో కుస్తీ పడుతూ, ఢిల్లీలో దోస్తీ నడిపే తెరచాటు రాజకీయాలకు ఈ ఎన్నికలే గుణపాఠం అవుతాయని, మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని షర్మిల అన్నారు. సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ మద్దతుదారులను ఇబ్బందులు పాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పెట్టుకున్నాయని, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ పై ఎలాంటి విచారణ ఉండదు, లిక్కర్ స్కాంలో వేల కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ బిడ్డపై ఎలాంటి చర్యలు తీసుకోరు.. భూకబ్జాలతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ బందిపోట్లపై ఐటీ, ఈడీ సోదాలు జరగవు.. కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంత కన్నా నిదర్శనం ఏముంటుంది? అంటూ షర్మిల నిలదీశారు.

Also Read : CM KCR : భూకబ్జాదారు రేవంత్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు : సీఎం కేసీఆర్

ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని షర్మిల హెచ్చరించారు.