Congress Second List : కామారెడ్డి, సిరిసిల్ల సహా ఆ 19 స్థానాలు పెండింగ్‌లో ఎందుకు?

కాంగ్రెస్ పార్టీ ఇంకా 19 స్థానాలను ఎందుకు పెండింగ్ లో పెట్టింది? వాటికి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది? అసలు కాంగ్రెస్ హైకమాండ్ స్ట్రాటజీ ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Congress Second List

Telangana Congress Second List 19 Seats In Pending

Telangana Congress Second List : ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. అన్ని అంశాల్లో ప్రణాళికబద్దంగా ముందుకెళ్తోంది. హామీలు, వాగ్దానాలు, మేనిఫెస్టో, ప్రచారం, గెలుపు గుర్రాల ఎంపిక.. ఇలా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటోంది. బీఆర్ఎస్ ను ఢీకొట్టేలా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. తాజాగా (అక్టోబర్ 27) కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల చేసింది. 45మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటించింది.

ఆ 19 పెండింగ్ లో ఎందుకు?
ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. నేడు 45 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించింది. దాంతో మొత్తం 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు గుర్రాలపై స్పష్టత వచ్చేసింది. మరో 19 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ ఇంకా 19 స్థానాలను ఎందుకు పెండింగ్ లో పెట్టింది? వాటికి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది? అసలు కాంగ్రెస్ హైకమాండ్ స్ట్రాటజీ ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కామారెడ్డిలో కొనసాగుతున్న సస్పెన్స్..
కాగా, పెండింగ్ లో ఉంచిన 19 సీట్లలో.. నాలుగు స్థానాలను కమ్యూనిస్టులకు కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా.. ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు స్థానాలను వామపక్షాలకు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో తమ అభ్యర్థిని ప్రకటించ లేదు కాంగ్రెస్. కాగా, ఈ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. రెండో జాబితాలో మాత్రం కామారెడ్డి అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్.. సస్పెన్స్ కంటిన్యూ చేస్తోంది.

Also Read : గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్, ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే

కేటీఆర్ పై పోటీ చేసేది ఎవరు?
ఇక మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం అభ్యర్థిని పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక్కడి నుంచి గత నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినా.. రెండో జాబితాలో సిరిసిల్ల అభ్యర్థి పేరు కనిపించలేదు. ఇక్కడి నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని, రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్ల అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పెండింగ్ లో ఎక్కువగా ఆ రెండు జిల్లాల నియోజకవర్గాలే..
కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన నియోజకవర్గాలే ఉన్నాయి. కమ్యూనిస్టులకు కేటాయించిన నియోజకవర్గాలను మినహాయిస్తే ఖమ్మం జిల్లాలో ఇల్లందు, సత్తుపల్లి, అశ్వారావు పేట సీట్లకు అభ్యర్థులను ప్రకటించ లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరు, కరీంనగర్, నారాయణ్ పేట్ నియోజకవర్గాలు ఇంకా పెండింగ్ లిస్టులోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఇటీవలే పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్.. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..

* ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి
* ఆసిఫాబాద్ – శ్యామ్ నాయక్
* ముథోల్ – నారాయణ రావు పాటేల్
* కూకట్ పల్లి – బండి రమేశ్
* శేరిలింగంపల్లి – జగదీశ్ గౌడ్
* తాండూరు – మనోహర్ రెడ్డి
* సికింద్రాబాద్ కంటోన్మెంట్ – వెన్నెల
* మహబూబ్ నగర్ – ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
* మునుగోడు – కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
* పాలకుర్తి – యశశ్విని
* పరకాల – రేవూరి ప్రకాష్ రెడ్డి
* వర్ధన్నపేట -నాగరాజు
* ఖమ్మం – తుమ్మల నాగేశ్వర రావు
* పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* పినపాక – పాయం వెంకటేశ్వర్లు

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఇటీవలే పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్న వారు వీరే

ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా..

1. రావి శ్రీనివాస్- సిర్పూర్
2. అజ్మీరా శ్యామ్- ఆసిఫాబాద్
3. వెడమ బొజ్జు- ఖానాపూర్
4. కంది శ్రీనివాస్ రెడ్డి- ఆదిలాబాద్
5. వెన్నెల అశోక్- బోధ్
6. నారాయణరావు పాటిల్- ముథోల్
7. మదన్ మోహన్ రావు- ఎల్లారెడ్డి
8. భూపతిరెడ్డి- నిజామాబాద్ రూరల్
9. జువ్వాడి నరసింగరావు- కోరుట్ల
10. మేడిపల్లి సత్యం- చొప్పదండి
11. వడితల ప్రణవ్- హుజూరాబాద్
12. పొన్నం ప్రభాకర్- హుస్నాబాద్
13. పూజల హరికృష్ణ- సిద్ధిపేట
14. ఆవుల రాజిరెడ్డి- నర్సాపూర్
15. చెరుకు శ్రీనివాస్ రెడ్డి- దుబ్బాక
16. బండి రమేశ్- కూకట్ పల్లి
17. మధుయాష్కీ గౌడ్- ఎల్బీనగర్
18. మల్ రెడ్డి రంగారెడ్డి- ఇబ్రహీంపట్నం
19. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి- మహేశ్వరం
20. కస్తూరి నరేందర్- రాజేంద్రనగర్
21. జగదీశ్వర్ గౌడ్- శేరిలింగంపల్లి
22. మనోహర్ రెడ్డి- తాండూరు
23. రోహిన్ రెడ్డి- అంబర్ పేట్
24. విజయారెడ్డి- ఖైరతాబాద్
25. మహ్మద్ అజారుద్దీన్- జూబ్లీహిల్స్
26. జీవీ వెన్నెల- సికింద్రాబాద్ కంటోన్మెంట్
27. వాకిటి శ్రీహరి- మక్తల్
28. చిన్నారెడ్డి- వనపర్తి
29. బాలూ నాయక్- దేవరకొండ
30. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మునుగోడు
31. కుంభం అనిల్ కుమార్ రెడ్డి- భువనగిరి
32. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి- జనగామ
33. యశస్విని- పాలకుర్తి
34. మురళీ నాయక్- మహబూబాబాద్
35. రేవూరి ప్రకాశ్ రెడ్డి- పరకాల
36. నాయిని రాజేందర్ రెడ్డి- వరంగల్ వెస్ట్
37. కొండా సురేఖ- వరంగల్ ఈస్ట్
38. నాగరాజు- వర్ధన్నపేట
39. పాయం వెంకటేశ్వర్లు- పినపాక
40. ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు
41. పొంగులేటి శ్రీనివాసరెడ్డి- పాలేరు
42. పరిణికా రెడ్డి- నారాయణపేట్
43. యెన్నం శ్రీనివాస్ రెడ్డి- మహబూబ్ నగర్
44. అనిరుధ్ రెడ్డి- జడ్చర్ల
45. మధుసూదన్ రెడ్డి- దేవరకద్ర