Telangana BJP Big Plan
అసెంబ్లీ ఫైట్ లో గెలుపే అందరి లక్ష్యం. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వందకుపైగా నియోజకవర్గాల్లో విజయమే టార్గెట్ గా పని చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ సంక్షేమం, 9ఏళ్ల పాలన చూపుతుండగా.. కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ ను నమ్ముకుంది.
ఈ రెండు పార్టీ తీరు ఒకలా ఉంటే.. బీజేపీ వైఖరి మరోలా ఉంది. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహామే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుండి కమలనాథుల వ్యూహం ఒక్కటే. ఈ ఎన్నికల్లో మెజారిటీ మార్కు చేరుకోవడం కన్నా కనీసం పాతిక సీట్లలో గెలిచి రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా మారాలని భావిస్తోంది బీజేపీ.
Also Read : కేసీఆర్ అలా చేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తమకు 25 సీట్లు వస్తే ఏ పార్టీకి కూడా మెజారిటీ దక్కదని అప్పుడు హంగ్ అసెంబ్లీలో తామే కింగ్ అవుతామనే ఆశల పల్లకిలో బీజేపీ విహరిస్తోంది. మరి కాషాయ నేతలు లెక్కలు వేసుకుంటున్న ఆ 25 నియోజకవర్గాలు ఏవి? ఆ స్థానాల్లో గెలుపుపై కమలనాథులకు అంత ధీమా ఎందుకు?