Telangana Elections 2023 : బీజేపీ జోరు.. రంగంలోకి అగ్రనేతలు, ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

BJP Top Leaders Election Campaign (Photo : Google)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ మరింత జోరు పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. నేడు రాష్ట్రంలో ఆ పార్టీ అగ్రనాయకులు క్యాంపెయిన్ చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి మురళీధరన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షెడ్యూల్..
* 12.30 గంటలకు జగిత్యాల లో రోడ్ షో
* 2 గంటలకు బోధన్ లో సభ
* 3 గంటలకు బాన్సువాడలో సభ
* 4 గంటలకు జుక్కల్ సభలో పాల్గొంటారు.ననున్న నడ్డా

కేంద్రహోంమంత్రి అమిత్ షా టూర్ షెడ్యూల్..
11 గంటలకు హుజురాబాద్ లో పర్యటన
1 గంటకు పెద్దపల్లిలో పర్యటన
2 గంటలకు మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటించనున్న అమిత్ షా

Also Read : హుజూర్‌నగర్‌లో ట్రయాంగిల్ ఫైట్.. గెలుపెవరిది?

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ…
11 గంటలకు దేవరకొండ
1 గంటకు మంథని
2 గంటలకు పరకాల
3.30 గంటలకు వరంగల్ పార్టీ ఆఫీసు నుంచి రోడ్ షో
5 గంటలకు దుబ్బాక సభలో పాల్గొననున్న హిమంత బిశ్వ శర్మ

కేంద్రమంత్రి పియూష్ గోయల్..
సాయంత్రం 6గంటలకు హన్మకొండలో మేధావులతో సమావేశం

కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్..
11 గంటలకు భద్రాచలం
12.30 గంటలకు సిద్దిపేట సభలో పాల్గొననున్న అనురాగ్ సింగ్ ఠాకూర్

కేంద్ర మంత్రి మురళీధరన్..
12 గంలటకు అలంపూర్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం.
మధ్యాహ్నం 3గంటలకు అలంపూర్ లో డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొననున్న మురళీధరన్.

Also Read : తెలంగాణలో రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన ”ఆ నలుగురు”

ప్రధాని మోదీ షెడ్యూల్..
27వ తేదీ..
10.25 తిరుపతి విమానాశ్రయం నుండి బయలుదేరి 11.30 హాకీంపేట విమానాశ్రయనికి చేరుకోనున్న నరేంద్రమోదీ.
అక్కడి నుండి 12.35 మహబూబాబాద్ చేరుకోనున్న నరేంద్రమోదీ.
12.45 నుండి 1.25 వరకు 40 నిమిషాల పాటు సభలో పాల్గొనున్న నరేంద్రమోదీ.
1.35 మహబూబ్ బాద్ నుండి బయలుదేరి 2.30కు కరీంనగర్ చేరుకుంటారు.
2.45 నుండి 3.25 వరకు కరీంనగర్ సభలో పాల్గొంటారు.
కరీంనగర్ సభ అనంతరం తిరిగి 4.35 హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
సాయంత్రం 5గంటల నుండి 6 వరకు హైదరాబాద్ లో రోడ్ షో.
ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్లు రోడ్ షో.
రోడ్ షో అనంతరం గురుపౌర్ణమి నేపథ్యంలో అమీర్ పేట్ లోని గురుద్వార్ లో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ.