Telangana Exit Polls 2018 : ఎగ్జిట్ పోల్స్‌లో నిజమెంత? ప్రజాతీర్పును నిర్ధారిస్తాయా? 2018లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే

ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తారుమారు అవుతాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేది మేమే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సంచలనంగా మారాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ఫలితాన్ని అంచనా వేసింది. కొన్ని సంస్థలు మరోసారి బీఆర్ఎస్ దే గెలుపు, హ్యాట్రిక్ విజయం ఖాయం అని అంచనా వేయగా.. మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అంచనా కట్టాయి.

ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగానే స్పందించారు. రబ్బిష్, దిక్కుమాలిన సర్వేలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తారుమారు అవుతాయని, వాటిని ఎవరూ నమ్మొద్దని కేటీఆర్ అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేది మేమే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు 2018లోనూ ఇదే జరిగిందని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో 2018 ఎగ్జిట్ పోల్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అసలు.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? ఎగ్జిట్ పోల్స్ ప్రజాతీర్పును నిర్ధారిస్తాయా? ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఉన్న నిజమెంత? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా వచ్చాయో పరిశీలిస్తే..

Also Read : తెలంగాణలో గెలిచేది ఈ పార్టీనే..! ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు

టైమ్స్ నౌ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు 2018
టీఆర్ఎస్ – 66
కాంగ్రెస్ – 37
బీజేపీ – 07
ఇతరులు – 09

యాక్సిస్ మై ఇండియా
టీఆర్ఎస్ 81
కాంగ్రెస్+ 27
ఇతరులు 6

సీ ఓటర్
టీఆర్ఎస్ 58
కాంగ్రెస్ 45
ఇతరులు 11

న్యూస్ ఎక్స్ నేత
టీఆర్ఎస్ 57
కాంగ్రెస్ 46
బీజేపీ 06
ఇతరులు 10

పోల్ ఆఫ్ పోల్స్
టీఆర్ఎస్ 66
కాంగ్రెస్ 39
ఇతరులు 09

జన్ కీ బాత్
టీఆర్ఎస్ 50-65
కాంగ్రెస్ 38-52
బీజేపీ 04-07
ఇతరులు 08-14

న్యూస్ నేషన్
టీఆర్ఎస్ 55
కాంగ్రెస్ 53
బీజేపీ 03
ఇతరులు 08

Also Read : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా.. వాస్తవ ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ కు అత్యధికంగా 88 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 21 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాలను కైవసం చేసుకుంది.

టీఆర్ఎస్ కు 60 కు మించి సీట్లు రావని, కాంగ్రెస్ కు 50 సీట్లు వస్తాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ, వాస్తవ ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. అదే విధంగా ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అవుతాయని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 70కి పైగా సీట్లలో గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు