Bandi Sanjay : కరీంనగర్‌లో బండి సంజయ్ విజయంపై మైనార్టీ ఓటు ప్రభావం ఎంత?

నా మీద అవినీతి ఆరోపణలు లేవు, కబ్జా ఆరోపణలు లేవు. ముస్లిం మైనారిటీలలో కూడా అదే ఆలోచన ఉంది. ముస్లింలు అయినా హిందువులు అయినా కరీంనగర్ ప్రజలంతా బండి సంజయ్ కు అండగా ఉన్నారు.

Bandi Sanjay Kumar

తెలంగాణలో ప్రచారం హోరెత్తుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ సీఎం కేసీఆర్, అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ.. ఇలా జాతీయ స్థాయి నాయకులంతా కూడా తెలంగాణలో మకాం వేశారు. ఇవాళ కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ తో 10టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ..

ప్రశ్న : కరీంనగర్ లో మీ విజయంపై మైనార్టీ ఓటు ప్రభావం ఎంత?
”కరీంనగర్ లో మైనార్టీ వర్గంలోనూ ఒక ఆలోచన వచ్చింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మసీదు స్థలాలు కబ్జా చేస్తారనే అనుమానం మైనార్టీ వర్గాల్లో ఉంది. బండి సంజయ్ వచ్చాక ఏనాడు కూడా కరీంనగర్ లో కబ్జాలకు పాల్పడలేదు. అవినీతికి పాల్పడలేదు. నిరంతరం ప్రజల కోసం పని చేశాను తప్ప కబ్జాలు చేయలేదు. నా మీద అవినీతి ఆరోపణలు లేవు, కబ్జా ఆరోపణలు లేవు. ముస్లిం మైనారిటీలలో కూడా అదే ఆలోచన ఉంది. ముస్లింలు అయినా హిందువులు అయినా కరీంనగర్ ప్రజలంతా బండి సంజయ్ కు అండగా ఉన్నారు. ఏ ముస్లిం కూడా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి లేదు” అని బండి సంజయ్ అన్నారు.

Also Read : కేసీఆర్ మోసం చేశారు, ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయం- రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

ప్రశ్న : సాధువులు, సంతువులు, హిందువులు అంతా ఏకం కావాలి అని అన్నారు? వ్యూహం ఏంటి?
”ముస్లిం మత పెద్దలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు వచ్చి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. మరి సాధువులు, సంతువులు, అర్చక సమాజం.. హిందువులంతా బీజేపీకి ఓటు వేయాలని ఎందుకు కోరడం లేదు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? కచ్చితంగా బయటకు రావాల్సిందే. సమాజాన్ని జాగృతం చేయాల్సిందే. ధర్మం కోసం పని చేసే వ్యక్తి బండి సంజయ్. బండి సంజయ్ ఎంపీగా గెలిచాక ఎక్కడా మతఘర్షణలు జరగలేదు. దేశానికి ఆపద వస్తే.. దేశాన్ని, ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే కచ్చితంగా బండి సంజయ్ అడ్డుకుంటాడు” అని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.

ప్రశ్న : వందల కోట్లు సంపాదించారు, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని మీరే ఖరారు చేశారు అనే ఆరోపణలపై మీరు ఏమంటారు?
” కాంగ్రెస్ లిస్టు మొత్తం ప్రగతిభవన్ లో తయారైంది. కేసీఆర్ ఆమోద ముద్ర పడితేనే కాంగ్రెస్ లిస్టు బయటకు వచ్చింది. ఇది వాస్తవం కూడా. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. బండి సంజయ్ ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు” అని ఎదురుదాడికి దిగారు బండి సంజయ్.

Also Read : తెలంగాణలో రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన ”ఆ నలుగురు”

ప్రశ్న : బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం వల్ల బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అని అంటున్నారు. మీరు ఏమంటారు?
”బీజేపీ వ్యక్తి ఆధారంగా పని చేసే పార్టీ కాదు. బీజేపీ కార్యకర్తలు అంతా సిద్ధాంతం కోసం, పార్టీ జెండా కోసం, నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేసే వారు” అని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు