Gaddam Prasad Representative Image (Image Credit To Original Source)
Defected Mlas: పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యపై నమోదైన ఫిరాయింపు పిటిషన్ పై విచారించిన స్పీకర్.. వారు పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. అదే విధంగా వీరి అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ తుది తీర్పు ఇచ్చారు స్పీకర్. మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువరించాల్సి ఉంది. వీరి విషయంలోనూ త్వరలోనే స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ లకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉంది.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విషయంలో గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరికి (చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి) క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున అనర్హత కేసును కొట్టివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
గతంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. ఈ 5 మందికి సంబంధించి తీర్పు ఇచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు ఎవిడెన్స్ లేదని కొట్టివేశారు. ఇప్పుడు కూడా అదే కారణంతో అనర్హత పిటిషన్ ను కొట్టివేశారు. పోచారం, కాలే యాదయ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. వీరిలో ఇప్పటివరకు ఏడుగురికి క్లీన్ చిట్ లభించింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పెండింగ్ లో ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
Also Read: మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..