Mla Sri Ganesh: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేపై దాడికి యత్నం.. 15 బైకులపై వచ్చిన దుండగులు.. ఆయుధాలు లాక్కునే ప్రయత్నం..

ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Mla Sri Ganesh: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ దాడికి యత్నించారు దుండగలు. 15 బైకులపై వచ్చిన దుండగులు ఎమ్మెల్యే కారుని అడ్డుకున్నారు. ఎమ్మెల్మే కారు డోరు, అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అంతేకాదు గన్ మెన్ల నుంచి వెపన్లు లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

మాణికేశ్వర్ నగర్‌లో జరుగుతున్న బోనాల జాతరకు ఎమ్మెల్యే వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంపై దాడికి యత్నించారు దుండగులు. అద్దాలు దించాలంటూ కారును వెంబడించారు. అప్రమత్తమైన గన్‌మెన్లు వాహనాన్ని నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌కు సూచించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గణేశ్ ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దుండగులు దాడికి యత్నించిన సమయంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులోనే ఉండిపోయారు.

దుండగులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఆ దుండగులు ఎవరు? ఇధి ఎవరి పని? ఎందుకు దాడికి యత్నించారు? అనేది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. దాడి ప్రయత్నం చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.