పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి.. యువకుడిపై పిడిగుద్దులు.. యువతిని లాక్కెళ్లే ప్రయత్నం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి బంధువులు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి.. యువకుడిపై పిడిగుద్దులు.. యువతిని లాక్కెళ్లే ప్రయత్నం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

Updated On : June 5, 2025 / 10:37 AM IST

Warangal : పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది. బుధవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన యువతి నితీష, యువకుడు మణిరాజ్ ప్రేమించుకున్నారు. వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

ఆ తరువాత వారు నల్లబెల్లి మండలంలోని యువకుడి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు వారిపై దాడికి యత్నించారు. దీంతో వారు అక్కడి నుంచి బయటపడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువతి బంధువులు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. యువకుడిపై పిడిగుద్దులతో దాడి చేసి యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు యువతి బంధువులను అడ్డుకొని పలువురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఆ తరువాత ప్రమ జంటకు పోలీసులు ఆశ్రయం కల్పించారు.

నితీషను పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. తను తన భర్తతోనే ఉంటానని పోలీసులకు నితీష తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు నితీష తల్లిదండ్రులను, బంధువులను అక్కడి నుంచి పంపించేశారు.