Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి

గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Attack on MLA Guvvala Balaraju

Attack On Guvvala Balaraju : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మరియు అతని వర్గీయులు రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, బాలరాజు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యులు, అనుచరులు 3 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రికి గువ్వల బాలరాజును తీసుకొచ్చారు. గువ్వల బాలరాజు దవడ భాగంలో గాయం అవ్వడంతో ఆయనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గువ్వల బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గువ్వల బాలరాజు అనుచరులు అపోలో ఆస్పత్రి వద్దనే ఉన్నారు.  ఈ ఘటనతో అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Kotha Prabhakar Reddy : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీపై కత్తితో దాడి

ఎన్నికల వేళ అచ్చంపేట రణరంగమైంది. అచ్చంపేట నియోజకవర్గంలో ఎన్నిక ప్రచారంలో ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి సమయంలో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ అక్కడ డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్ద ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం బాలరాజును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు, అనుచరులు బాలరాజును హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపోలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.