Attempt to buy woman for Rs.20 lakhs : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. 20 లక్షల రూపాయల డబ్బు ఆశచూపి..ఓ నిరుపేద యువతిని కొనుగోలు చేయడానికి కొంతమంది యత్నించారు. పెద్దపల్లిలోని అర్కుటి రాజయ్య – సరిత దంపతుల కూతురు దివ్యను కొనుగోలు చేసేందుకు ఐదుగురు సభ్యుల ముఠా యత్నించింది.
అయితే గ్రామంలో గొడవ జరగడంతో ముఠా గుట్టురట్టు అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.