Hyderabad Ancient Building
Building Height Raise Failed : హైదరాబాద్ చింతల్ లో ఓ పురాతన బిల్డింగ్ ను హైడ్రాలిక్ జాకీలతో ఎత్తు పెంచే ప్రయత్నం విఫలమైంది. చింతల్ లోని శ్రీనివాస నగర్ లో నాగేశ్వరరావుకు G+2 పాత బిల్డింగ్ ఉంది. ఇటీవల రోడ్డు వేయడంతో బిల్డింగ్ కిందకు అయిపోయింది.
దీంతో యూట్యూబ్ లో చూసిన యజమాని ఎలాగైనా బిల్డింగ్ ను జాకీలతో పైకి లేపాలని ప్రయత్నం చేశారు. రోడ్డుకు బిల్డింగ్ డౌన్ ఉండటంతో పైకి లేపే ప్రయత్నం చేశారు. జాకీలతో పైకి లేపే ప్రయత్నంలో భవనం రెండు ఫ్లోర్ పక్కకు ఒరిగాయి. కుంగి పోయిన భవనం పక్కనున్న వేరే భవనంపై ఒరిగిపోయింది.
బిల్డింగ్ పక్క బిల్డింగ్ కి ఆనుకోవడంతో రెండు బిల్డింగ్ లు ఎప్పుడు కూలుతాయోనని స్దానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఘటన స్దలానికి కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. తగిన జాగ్రత్తలు తీకుంటూ ఆదివారం భవనం కూల్చివేస్తామని స్థానికులకు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు.