Attempt Rape : నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాలికపై అత్యాచారయత్నం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏండ్ల బాలికపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ (21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు.

Attempt Rape

Attempted rape : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏండ్ల బాలికపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ (21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు.

దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Girl Raped : తుపాకీతో బెదిరించి బాలిక‌పై గ్యాంగ్ రేప్

బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నీరజ్‌పై దిశ, నిర్భయ, ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో పెయింటింగ్ పనులు చేసేందుకు నీరజ్ కూలీగా వచ్చినట్లు పోలీసులు తెలిపారు.