Site icon 10TV Telugu

తెలంగాణలో వృద్ధులకు 5లక్షల వరకు ఆరోగ్య బీమా.. ఏప్రిల్ నుంచి అమల్లోకి.. ఏఏ ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చంటే..

Ayushman Vaya Vandana scheme

Ayushman Vaya Vandana scheme

Ayushman Vay Vandana : ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ఈ పథకం ఏప్రిల్ నెల నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ అమల్లోకి రానుంది. ఈ పథకంకు వయసు ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 70ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు.

Also Read: తెలంగాణలోని కౌలు రైతులకు శుభవార్త.. లక్షల్లో పంట రుణాలు.. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

కార్డు ఎలా పొందాలంటే..
ఆధార్ కార్డులో 70ఏళ్ల వయసు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వాళ్లు ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డును పొందవచ్చు. beneficiary.nha.gov.in ద్వారా లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర సిబ్బందికి ఆధార్ కార్డు వివరాలు అందిస్తే రిజిస్టర్ చేసి కార్డును అందిస్తారు.

Also Read: TGPSC Group 1 Results : ఉగాది రోజున గ్రూపు-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల.. డౌన్‌‌లోడ్ చేసుకోండిలా..!

ఈ ఆస్పత్రుల్లో ఫ్రీగా చికిత్స..
ఆయుష్మాన్ వయో వందన కార్డులు ఉన్నవారు ప్రభుత్వ హాస్పిటల్స్, ఎమ్ ప్యానెట్ అయి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫ్రీగా చికిత్స పొందొచ్చు. రాష్ట్రంలో 416 ప్రైవేట్ ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్ స్కీం తో ఎం ప్యానెల్ అయి ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వయో వందన కార్డు కలిగిన వారు వైద్య సేవలను పొందొచ్చు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 66 ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 47 ఆస్పత్రులు నెట్ వర్క్ లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా 1017 ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఈ సేవలను సీనియర్ సిటిజన్స్ పొందవచ్చు.

 

రూ.5లక్షల వరకు ఫ్రీగా..
ఈ పథకం కింద డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా చికిత్స పొందవచ్చు. ట్రీట్మెంట్, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి రూ.5లక్షల వరకు ఫ్రీగా అందుతాయి.

 

Exit mobile version