కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులకు బీఫాంల అందజేత

Congress: దానం నాగేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్ఠానం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ అభ్యర్థులకు బీఫాం అందజేసింది. సికింద్రాబాద్, భువనగిరి, మెదక్ అభ్యర్థులు దానం నాగేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ లతో పాటు మిగతా అభ్యర్థుల ప్రతినిధులకు బీఫామ్ లు అందజేశారు.

ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్ఠానం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుండి బీ ఫార్మ్ తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సికింద్రాబాద్‌లో ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల తో ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పారు.

నీలం మధు మాట్లాడుతూ… తనకు మెదక్ టికెట్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్ నుంచి తనకు బీఫాం రావడం ఇంకా హ్యాపీగా ఉందని తెలిపారు. మెదక్‌లో అత్యధిక మెజారితో గెలవబోతున్నానని చెప్పారు.

పామర్రులో టీడీపీకి ఎందుకీ పరిస్థితి? ఈ ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?

ట్రెండింగ్ వార్తలు