Uday Bhaskar joined BRS
Uday Bhaskar joined BRS : ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నాయకుడు బాబు మోహన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తనయుడు ఉదయ్ భాస్కర్ బీఆర్ఎస్ లో చేరారు. ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బాబు మోహన్ తనయుడు బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి ఉదయ్ భాస్కర్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఈ ఎన్నికల్లో ఉదయ్ భాస్కర్ ఆందోల్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు.
బాబు మోహన్ కూడా తన కొడుక్కే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు. కానీ, పార్టీ హైకమాండ్ మాత్రం బాబు మోహన్ కు టికెట్ కేటాయించింది. దీంతో మనస్థాపానికి గురైన బాబు మోహన్ కుమారుడు ఉదయ్ భాస్కర్ బీఆర్ఎస్ లో కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఆదివారం హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014లో బాబు మోహన్ బీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆందోల్ నుంచి బాబు మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో బాబు మోహన్ కు ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.