ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. బ్యాగు తీసుకెళ్తున్నారా?

మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల బ్యాగులు, సూటుకేసులను పోలీసులు చెక్ చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల బ్యాగులు, సూటుకేసులను పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు ఇప్పటికే పోలీసులు రోడ్లపై తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే.

మెట్రో రైళ్లలోనూ అక్రమంగా డబ్బులు రవాణా చేస్తారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మెట్రో స్టేషన్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు తీసుక వెళుతున్న బ్యాగులను క్షణ్ణంగా చెక్ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. రోడ్ల మార్గాన డబ్బును తీసుకెళ్తే పట్టుబడుతున్నామని కేటుగాళ్లు మెట్రోలో డబ్బులు తరలించే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది.

ఎండల వేడిని తట్టుకోవడానికి హైదరాబాద్ వాసులు మెట్రో ట్రైన్లను అధికంగా వాడుతున్నారు. మెట్రో హాలీడే కార్డును కూడా పొడిగించడంతో సెలవు దినాల్లోనూ ట్రైన్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఎన్నికలు జరగకుండానే ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి

ట్రెండింగ్ వార్తలు