Bairi Naresh
Bairi Naresh: భారత నాస్తిక సమాజం బహిష్కృత నాయకుడు బైరి నరేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకుపోయింది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏటూరు నాగారంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బైరి నరేశ్ మూఢ నమ్మకాలను నిర్మూలిస్తానంటూ ప్రసంగించసాగారు. బైరి నరేశ్ మాట్లాడుతుండగా అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అయ్యప్ప భక్తులు, బైరి నరేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్తుండగా బైరి నరేశ్ కారు భక్తులపైకి దూసుకువెళ్లింది. పోగు నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడి కాలు విరిగింది. దీంతో ఏటూరునాగారం వై- జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.
గత ఏడాది కూడా ఇదే సమయంలో బైరి నరేశ్ అయ్యప్ప స్వాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో ఆయనను అయ్యప్ప భక్తులు చితగ్గొట్టారు. ఆ తర్వాత బైరి నరేశ్‌ను భారత నాస్తిక సమాజం నుంచి బహిష్కరించారు. బైరి నరేశ్ కొత్తగా మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నారు.
Donthireddy Vemareddy: వాటి గురించి అందరికీ చెప్పే అవసరం లేదు: వేమారెడ్డి