Banda Prakash
Banda Prakash Elected : తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుంచి బండ ప్రకాశ్ ఎదిగారని పేర్కొన్నారు. వెనుకబడిన సామాజిక వర్గం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. ముదిరాజ్ సామాజిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యా సాగర్ పదవీకాలం 2012, జూన్ 3న పూర్తైంది. అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం (ఫిబ్రవరి10,2023) నోటిఫికేషన్ విడులైంది. సీఎం కేసీఆర్ సూచన మేరకు బండా ప్రకాశ్ శనివారం (ఫిబ్రవరి 11,2023) నామినేషన్ వేశారు.
Telangana : రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా
ఆదివారం (ఫిబ్రవరి 12,2023) బండ ప్రకాశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బండా ప్రకాశ్ 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఎంపీగా ఆరేళ్ల పదవీకాలం పూర్తికాకముందే 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.