Bandi Sanay Slams Revanth Reddy
Bandi Sanjay : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హామీలే ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హామీల క్యాంపెయిన్ పోస్టర్‌ను సీఎం రేవంత్ (CM Revanth Reddy) విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదలపై స్పందించిన బండి సంజయ్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ పార్టీ ఓటమికి కారణమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ మోసపూరిత హామీలతోనే హర్యానా, మహారాష్ట్రలో ఓటమిపాలయ్యారని బండి సంజయ్ అన్నారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం ఇచ్చిన హామీలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే సాధ్యం కాదన్నారు. రూ. 15వేలు రైతు భరోసా, మహిళలకు రూ. 2,500 ఎక్కడ..? అని ఆయన సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించారు.
4వేలు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఎంఎస్‌పి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవి..? అన్నీ ఉత్త మాటలే అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నకిలీ ప్రచారంతో నకిలీ హామీలను ఢిల్లీ ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ బూటకపు హామీలు, బూటకపు ప్రచారాలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదని సూచించారు. కాంగ్రెస్‌కు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మరో ఓటమి ఖాయమన్నారు.
Read Also : KTR ED Investigation : 7 గంటలుగా కేటీఆర్ ఈడీ విచారణ.. బీఆర్ఎస్ క్యాడర్ లో టెన్షన్..