Bandi Sanjay: బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌కి పలు ప్రశ్నలు సంధించారు.
లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ నిలదీశారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. (Bandi Sanjay)
మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని బండి సంజయ్ అన్నారు. పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా? అని ప్రశ్నించారు.
ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని బండి సంజయ్ అన్నారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Is Car Party running on smuggled luxury cars?
Why is #TwitterTillu seen in land cruisers imported by luxury car scam-accused Basarath Khan, arrested by DRI Ahmedabad?
Why are they registered with companies linked to KCR’s family?
Were these cars bought at market price or…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 22, 2025