Bandi Sanjay: దీన్ని కేటీఆర్ రాజకీయ కోణంలో చూడొద్దు: బండి సంజయ్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

Bandi Sanjay

Bandi Sanjay – BJP: శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mukherjee) వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు విజయశాంతి(Vijaya Shanthi), వివేక్ (Vivek), బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud), ఇతర నేతలు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. రాజకీయాలు, ప్రభుత్వాలు వేర్వేరు అని అన్నారు. ఏ ముఖ్యమంత్రి అడిగినా, ఏ నాయకుడు అడిగినా ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇస్తారని తెలిపారు. కేటీఆర్ కేంద్ర మంత్రులతో భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు.

కేటీఆర్ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని బండి సంజయ్ సవాలు విసిరారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఏ నేత మానసిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణలోని దుబ్బాక, హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లు కూడా దక్కలేదని విమర్శించారు. బీజేపీ నుంచి ఏ నేతా ఇతర పార్టీలోకి వెళ్లబోరని చెప్పారు.

తమ పార్టీలోని ప్రతి కార్యకర్తకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తి అని బండి సంజయ్ చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం బలయ్యారని అన్నారు. దేశ విభజనను వ్యతిరేకించారని తెలిపారు. దేశం సమైక్యంగా ఉండడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లేకపోతే బెంగాల్ పాకిస్థాన్ లో కలిసేదని చెప్పారు. 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారని అన్నారు.

Komatireddy Venkat Reddy : డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చలు