Bandi Sanjay: ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాలి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు

Bandi Sanjay Kumar

ఎన్నికల వరకే రాజకీయాలని, నియోజక వర్గ అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రంలో స్థానిక నేతలతో కలిసి రూ.25 కోట్ల వ్యయంతో మల్యాల చౌరస్తా నుంచి కాచారం వరకు నిర్మిస్తున్న రోడ్ల విస్తరణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత ప్రొటోకాల్ పాటించడం శుభ పరిణామమని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో శంకుస్థాపన చేయడం ఆనందం కలిగించిందని, గత బీఆర్ఎస్ హయాంలో ప్రొటోకాల్ పాటించడాలు, ప్రారంభోత్సవాలు లేవని చెప్పారు.

పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు దండుకోవడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి పనులు జరిగాయని అన్నారు. గత ప్రభుత్వంలో కేంద్ర నిధులు దారి మళ్లాయని చెప్పారు. రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ తమిళనాడులోని ఆ చిన్న గ్రామంలో కమలా హారిస్ బ్యానర్