Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ తమిళనాడులోని ఆ చిన్న గ్రామంలో కమలా హారిస్ బ్యానర్
చెన్నైకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో తులసేంద్రపురం ఉంటుంది.

తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బ్యానర్ వెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురానికి చెందిన వ్యక్తే.
దీంతో ఆ గ్రామంలో కమలా హారిస్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి ఆమె గెలవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. చెన్నైకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో తులసేంద్రపురం ఉంటుంది. కమలా హారిస్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడం తమకు గర్వకారణమని ఆ గ్రామస్థులు అంటున్నారు. ఆమె విజయం కోసం స్థానిక గుడిలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు.
తాజాగా అక్కడ స్వీట్ల పంపిణీ కూడా చేశారు. కమలా హారిస్ గెలుస్తారా లేదా అన్న తమకు సంబంధం లేని విషయమైనా, ఆమె పోటీ చేయడం చారిత్రాత్మకమైనదని, తమకు గర్వకారణమని స్థానిక రాజకీయ నాయకుడు ఎం మురుకానందన్ అన్నారు.
కమలా హారిస్ తల్లి తమిళనాడుకు చెందిన మహిళే. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ బ్రెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలు. మెడిసిన్ చదవడానికి స్కాలర్‌షిప్‌పై ఆమె 19 సంవత్సరాల వయస్సులో అమెరికా వెళ్లారు. ఆమెకు కమలా హారిస్, ఆమె చెల్లెలు మాయ అమెరికాలో జన్మించారు.
Viral Video: “జై శ్రీరాం అను” అంటూ అమెరికా గాయని, నటి సెలీనా గోమెజ్‌ను కోరిన యువకుడు