Bandi Sanjay (Photo : Facebook)
బీఆర్ఎస్‌ను పూర్తిగా బొంద పెట్టడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీని కూకటివేళ్లతో తొలగించే వరకు తాము విశ్రమించబోమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. అయోధ్య రామ మందిరానికి తలుపులు తయారుచేసిన హైదరాబాద్‌లోని అనురాధ టింబర్ డిపోను సందర్శించిన బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణలో కాళేశ్వం ప్రాజక్ట్‌లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణను ఎందుకు కోరటం లేదని సర్కారుని ప్రశ్నించారు బండి సంజయ్. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం తనను ఎక్కడ నుంచి పోటీ చేయాలని కోరితే అక్కడి నుంచి పోటీ చేస్తానన్నారు. ఒకవేళ పోటీ నుంచి తప్పుకోవాలని ఆదేశించినా తప్పుకుంటానని చెప్పారు.
అదృష్టం ఉండడం వల్లే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ఉండడడం వల్లే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో సర్కారుపై వ్యతిరేక మెదలైందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలలాగే కాంగ్రెస్ మంత్రులు కూడా అహకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
C Ramachandraiah: మరో సంచలనం.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, విజయసాయి రెడ్డి బంధువులు