MP Bandi Sanjay : పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏదైనా జరగొచ్చు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏమైనా జరగొచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

MP Bandi Sanjay

Telangana Politics : మరికొద్ది నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏమైనా జరగొచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని, కాంగ్రెస్ లో ఆయన కోవర్టులు ఉన్నారని అన్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన కోవర్టులకు పెద్ద ఎత్తున నిధులిచ్చారని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ సన్నిహితులపైన కాంగ్రెస్ వాళ్లు ఓ కన్నేసి ఉంచాలని సంజయ్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పోరాటం తర్వాత చూసుకోవచ్చు.. ముందు బీఆర్ఎస్ పనిచూడండి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంజయ్ సూచించారు.

Also Read : Chandrababu – Pawan Kalyan : జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం.. వచ్చేది మన ప్రభుత్వమే.. మందడంలో భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

బీఆర్ఎస్ కూల్చే పార్టీ.. బీజేపీ నిర్మించే పార్టీ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీనా? రాష్ట్ర పార్టీనా?.. జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలోనే ఆ పార్టీకి అభ్యర్థులు దిక్కులేరని, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ సర్కారేనని సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమని, ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సంజయ్ అన్నారు.

Also Read : Amabti Rambabu : మళ్లీ వేసేశాడు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

కేసీఆర్ యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చాడని, యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మ చెక్కించుకున్నాడని సంజయ్ అన్నారు. అయోధ్య రామమందిరం పూర్తికాకముందే పున: ప్రతిష్ట చేస్తున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ.. సాధు సంతువులు సూచించిన మంచి ముహూర్తం ప్రకారమే గృహ ప్రవేశం చేస్తారని, దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని సంజయ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు.. బీఆర్ఎస్ మాదిరిగా కేంద్రాన్ని తిట్టడానికి పరిమితమై సమయాన్ని వృథా చేయొద్దని, అందరం కలిసి కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తీసుకొద్దామని కోరుకుంటున్నానని సంజయ్ అన్నారు.