Amabti Rambabu : మళ్లీ వేసేశారు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక గీతానికి బంజారా మహిళలతో కలిసి హుషారుగా అంబటి అదిరిపోయే స్టెప్పులు వేశారు.

Amabti Rambabu : మళ్లీ వేసేశారు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

Amabti Rambabu

Updated On : January 14, 2024 / 3:20 PM IST

Bhogi 2024 Celebrations : తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్రతీ పల్లె, పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెన పల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గత నాలుగేళ్లుగా ప్రతీయేటా అంబటి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. అంబటి రాంబాబు దగ్గరుండి స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులతో డ్యాన్స్ చేయించారు. అనంతరం అంబటి ప్రత్యేక గీతానికి స్టెప్పులేశాడు.

Also Read : Happy Bhogi 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు

గత ఏడాది మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యేక గీతానికి బంజారా మహిళలతో కలిసి హుషారుగా అంబటి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది అపవిత్రమైన పొత్తు, వచ్చే ఎన్నికల్లో వారి పొత్తును ప్రజలు తగలేస్తారని అన్నారు. భోగి సందర్భంగా నృత్యం చేయడం, పాటలు పాడటం సంతోషంగా ఉంది, మనిషి ఆనందాన్ని ఆస్వాదించాలి, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను ఏదైనా బహిర్గతంగా చెప్పే స్వభావం కలిగిన వ్యక్తిని, విమర్శలు స్వీకరిస్తాను, విమర్శలు చేస్తాను. గతంలో నన్ను సంబరాల రాంబాబు అంటూ ట్రోల్ చేశారు.. అవును.. నేను సంక్రాంతికి సంబరాల రాంబాబునే.. పొలిటికల్ రాంబాబును.. సంబరాలను ఎంత హుషారుగా చేస్తానో రాజకీయాలు అంతే సీరియస్ గా చేస్తాను అంటూ అంబటి అన్నారు.