Chandrababu – Pawan Kalyan : జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం.. వచ్చేది మన ప్రభుత్వమే.. మందడంలో భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్
అమరావతి రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం’ పేరిట ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

Chandrababu & Pawan Kalyan Participated in Bhogi Celebrations
Bhogi Celebrations : అమరావతి రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం’ పేరిట ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గింగిరెద్దులు, సంక్రాంతి ముగ్గులు, పొంగళ్లతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు రాజధాని రైతులు, తెలుగుదేశం, జనసేన శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్ భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. రాష్ట్రంలో సర్వ వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయంటూ రూపొందించిన ప్లకార్డులు భోగి మంటల్లో ఇరువురు నేతలు వేశారు. ఈ కార్యక్రమంలో రాజధాని గ్రామాల ప్రజలు, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : Amabti Rambabu : మళ్లీ వేసేశాడు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
దేవతల రాజధానిని రాక్షసులు చెబట్టారు : చంద్రబాబు
దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ఇంకా 87రోజులే ఉంది.. లెక్కపెట్టుకోండని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఒకవైపు బాధ.. మరోవైపు కోపం.. ఈ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారని చంద్రబాబు అన్నారు. అమరావతిలో సంక్రాంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చేమన ప్రభుత్వంలో అమరావతి నుంచే పాలన ఉంటుందని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని.. విశాఖ, కర్నూలునగరాలకు పూర్వవైభవం తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఉంది ఏఒక్క కులం.. ఏఒక్క వర్గమో కాదు. అమరావతికోసం సంక్రాంతి సంకల్పం చేయాలి. నావి, పవన్ ఆలోచనలు ఒకటేనని చంద్రబాబు అన్నారు. పోలీసులు దుర్మార్గుడి చేతిలో బలయ్యారు. సంక్రాంతి సంకల్పం ముందుగా తీసుకోవాల్సింది పోలీసులే. పోలీసులు తమ బిడ్డలకోసం ఆలోచించాలి. సంక్రాంత్రి సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇవాళ పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి.. ఆ మానసిక రోగిని మార్చాలి. ఇంకేం అనుమానం అక్కర్లేదు.. మంచి రోజులు వచ్చేశాయి.. రాజకీయాల్లో ఉండటానికే అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో చీకటి రోజులు కొనసాగుతున్నాయి.. చీకటి జీవోలను భోగి మంటల్లో తగులబెట్టామని చంద్రబాబు చెప్పారు.
Also Read : Minister Roja : నగరిలో భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
నాలుగేళ్లుగా రాష్ట్రానికి పీడ పట్టుకుంది : పవన్ కల్యాణ్
నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి పీడ పట్టుకుంది.. ఆ కీడును, ఆ పీడను ఈరోజు భోగి మంటల్లో వేశాం అని పవన్ అన్నారు. నాకు రాజధాని ప్రాంత రైతులు, ప్రజల కష్టాలు తెలుసునని, ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసిముందుకెళ్తున్నాయంటే మీ అందరి ఆకాంక్షలకోసమేనన్నారు. మీరు మంచి ఉద్దేశంతో రాజధాని నిర్మాణానికి మీ భూములు ఇచ్చారు.. మేము ఉన్నాం.. మీరు ఏ ఉద్దేశంతో అయితే రాజధానికి భూమిలు ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరేలా తెలుగుదేశం, జనసేన పార్టీలు కృషి చేస్తాయని, బంగారు రాజధానిని నిర్మించుకుందామని పవన్ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకోసం మీరు రాజధానికి భూములు ఇచ్చారు.. మీరు ఇకనుంచి జై అమరావతితో పాటు.. జై ఆంధ్రా నినాదాన్నికూడా చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు మరింత చీకటిమయం అవుతుంది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకుండా.. వెలుగు నింపాలని భోగిరోజున జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిపి సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలని, మీకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పవన్ అన్నారు. వచ్చే సంవత్సరం జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా ఇక్కడ సంక్రాంతి సంబురాలు జరుపుకుందామని పవన్ అన్నారు.