Minister Roja : నగరిలో భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

నగరిలో తన నివాసం వద్ద భోగి మంటలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

Minister Roja : నగరిలో భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Roja

Updated On : January 14, 2024 / 8:58 AM IST

Bhogi Celebrations : ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. నగరి నియోజకవర్గంలోని తన నివాసం వద్ద భోగి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు.

Also Read : Amabti Rambabu : మళ్లీ వేసేశాడు..! భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

భోగి సందర్భంగా నగరిలోని తన నివాసం వద్ద భోగిమంటలు వేసి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. భర్త సెల్వమణి, ఇతర కుటుంబీకులతో కలిసి రోజా భోగి మంటవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్ నాయులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇక్కడకు వచ్చి ఏదో చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. మా పార్టీని భోగి మంటల్లో తగలు పెడతామని టీడీపీ నేతలు అంటున్నారు.. 2019లోనే మిమ్మల్ని ప్రజలు వాళ్ల ఓట్లతో తగులపెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని అన్నారు. జగనన్న వన్స్ మోర్ అంటూ ఏపీ ప్రజలంతా నినదిస్తున్నారు.. చంద్రబాబు, జనసేన కలిసినప్పటికీ వైసీపీదే మళ్లీ అధికారం అంటూ రోజా ధీమా వ్యక్తం చేశారు.