Bandi Sanjay : భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న బండి సంజయ్, 438 కి.మీ పాదయాత్ర

పాదయాత్రచార్మినార్‌ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.

Bhagyalakshmi Temple : పాదయాత్రచార్మినార్‌ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తవడంతో.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు. 36 రోజుల పాటు.. 438 కిలోమీటర్ల మేర బండి పాదయాత్ర సాగింది. ఎనిమిది జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలను, ఆరు పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేశారు బండి సంజయ్‌. 36 రోజుల్లో.. 35 సభలు నిర్వహించి.. తొలి విడత పాదయాత్రకు కరీంనగర్‌ జిల్లా.. హుస్నాబాద్‌లో ముగించారాయన.

Read More : AP : పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పంచ్‌లు..హైలెట్స్

ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ పాదయాత్ర ఆగస్టు 28న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలు వింటూ..  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి కూడా వివరించారు. పాదయాత్ర పొడవునా రైతులు, నిరుద్యోగులు, మహిళల సహా వివిధ వర్గాల నుంచి సుమారు 11 వేలకి పైగా వినతి పత్రాలు స్వీకరించారు. బండి సంజయ్ పాదయాత్రలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు.

Read More : Pawan Kalyan : ఎన్నికలకు దూరం.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

ఇక.. హుస్నాబాద్‌ సభ పాదయాత్రకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. భారీ స‌భ‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లో బండి సంజయ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఈటల గెలుపును ఆపలేరన్నారు. ధర్మం కోసం పోరాటమేనంటూ బండి ప్రజా సంగ్రామ యాత్ర ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సభలో కార్యకర్తలంతా సీఎం..సీఎం అంటూ అరుస్తుండడంతో.. ఆయన కలగజేసుకొని మాట్లాడారు. ఈ యాత్ర చేసేది సీఎం కావడానికి కాదని.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికేనన్నారు బండి సంజయ్‌.

ట్రెండింగ్ వార్తలు