AP : పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పంచ్‌లు..హైలెట్స్

రోడ్లు సక్రమంగా లేవంటూ గాంధీ జయంతి రోజున శ్రమదానం కార్యక్రమం చేపట్టారు పవన్ కల్యాణ్. పవర్‌ స్టార్ అని పిలవద్దని హెచ్చరించిన పవన్.. జనసేనానిగా పిలవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.

AP : పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పంచ్‌లు..హైలెట్స్

Pawan

Pawan Kalyan : ఏపీలో రోడ్లు సక్రమంగా లేవంటూ గాంధీ జయంతి రోజున శ్రమదానం కార్యక్రమం చేపట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజమహేంద్రవరం, పుట్టపర్తిలో పార్టీ కార్యకర్తలతో జనసేనాని స్వయంగా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిత రాజమండ్రిలో దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు వెల్‌కం చెప్పారు, అభిమానులకు అభివాదం  చేస్తూ పవన్‌ ముందుకు సాగారు. నగరంలోని క్వారీ సెంటర్‌లో పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన పర్యటనకు ఆటంకాలు సృష్టించొద్దని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు జనసేనాని.

Read More : IPL 2021 RR Vs CSK.. శివమెత్తిన దూబే.. చెన్నైని చిత్తు చేసిన రాజస్తాన్

గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు పవన్. శ్రమదానం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలన్నారు. తనపై మానసిక అత్యాచారం జరుగుతుందని.. తనను దూషించేవారిని వదిలిపెట్టబోనన్నారు పవన్‌ కల్యాణ్‌. అలాగే పవన్ ప్రసంగిస్తుండగా… కార్యకర్తలు పవర్ స్టార్.. పవర్ స్టార్ అని నినాదాలు చేస్తుండగా.. పవన్ సీరియస్ అయ్యారు. పవర్‌ వచ్చే వరకు తనను పవర్‌ స్టార్ అని పిలవద్దని హెచ్చరించిన పవన్.. జనసేనానిగా పిలవాలని కార్యకర్తలకు సూచించారు. వైసీపీకి అధికారమిస్తే కులాల్ని కుళ్ల బోడుస్తుందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Read More : EBC Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.45వేలు.. అర్హతలు, దరఖాస్తు విధానం..

తన సహనాన్ని పిరికితనం అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు పవన్. ఎవరి బెదిరింపులకు భయపడనన్న జనసేనాని… ఆఖరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనంతరం అనంతపురం జిల్లా పుట్టపర్తికి చేరుకున్న పవన్‌కు కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు. కొత్తచెరువులో పవన్ శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించిన జనసేనాని… వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అంటే వైసీపీ వణికిపోతోందన్నారు పవన్. అందుకే మంత్రులు బ్యాలెన్స్‌ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. మొత్తానికి ప్రభుత్వం పంచ్‌లు వేస్తూనే… రాయలసీమను రతనాల సీమ చేస్తానని… సీమను పరిశ్రమలు తీసుకువస్తానని హామీల వర్షం కురిపించారు పవన్‌.