Bandla Ganesh : మేడిగడ్డకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎలా నాశనం చేశారో చూసుకుంటారా..

మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు.

Bandla Ganesh

Bandla Ganesh Comments :  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రిపేరు అడ్డు పెట్టుకొని కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడని, కేసీఆర్ అబ్బాయిగా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపు లేదని గణేష్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పోరాట యోధుడు, బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యాడని బండ్ల కొనియాడారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని, రేవంత్ సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నాడని అన్నారు.

Also Read : Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మంత్రి పొన్నం ఏమన్నారంటే?

వందల యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని తిట్టిస్తున్నారని బండ్ల గణేష్ ఆరోపించారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మీ హయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్ కౌంటర్ చేయించే వాళ్లు.. రాళ్లతో కొట్టి చంపించేవాళ్లు.. అంటూ ఇటీవల సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ బండ్ల మాట్లాడారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లినట్లయితే మూడు సీట్లు కూడా రాకపోయేవని అన్నారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ హయాంలో పనిచేసిన అధికారుల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందని బండ్ల గణేష్ అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వెళ్లనున్నారు.. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ సెటైర్లు వేశారు. అదేవిధంగా ఏపీ మంత్రి రోజాపైనా బండ్ల గణేశ్ విమర్శలు చేశారు.