Bathukamma Exhibition On Burj Khalifa In Dubai Tomorrow
Batukamma Exhibition : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి బతుకమ్మ పండుగ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై శనివారం సాయంత్రం 9.40 నిమిషాలకు, రాత్రి10.40 నిమిషాలకు బతుకమ్మ వీడియో ప్రదర్శన జరుగనుంది.
ఇందులో మరో విశేషం ఏమిటంటే.. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది. దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (23వ తేదీ)న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Right to Vote: మీ ఓటును మరొకరు వేస్తే ఏం చేయాలో తెలుసా?
బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.దుబాయ్‌లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
2004 జనవరి 6న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలైంది. 2020 జనవరి 4న ఈ భవనాన్ని ప్రారంభించారు. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు. రేపు సాయంత్రం భారత కాలమానం ప్రకారం 9.40 PMలకు రాత్రి 10.40కు రెండు సార్లు బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు.
Garuda : కుటుంబానికి రూ.10వేలు.. ఏపీలో మరో కొత్త పథకం