Right to Vote: మీ ఓటును మరొకరు వేస్తే ఏం చేయాలో తెలుసా?

మన దేశంలో ఓటు హక్కుకు చాలా విలువ ఉంటుంది. అయితే.. అక్షరాస్యత లేకపోవడం.. బాధ్యతగా వ్యవహరించకపోవడం వంటి కారణాలతో కొంతమేర దాని ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తుంది కానీ..

Right to Vote: మీ ఓటును మరొకరు వేస్తే ఏం చేయాలో తెలుసా?

Right To Vote

Right to Vote: మన దేశంలో ఓటు హక్కుకు చాలా విలువ ఉంటుంది. అయితే.. అక్షరాస్యత లేకపోవడం.. బాధ్యతగా వ్యవహరించకపోవడం వంటి కారణాలతో కొంతమేర దాని ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తుంది కానీ.. మనల్ని పరిపాలించే వ్యక్తులను మనమే ఎన్నుకొనే హక్కే ఓటు హక్కు. దేశానికి పీఎం నుండి పంచాయతీ వార్డు నెంబర్ వరకు మనం వేసే ఓటు హక్కుతోనే ఎన్నుకోబడుతారు. ప్రస్తుత కాలంలో డబ్బు, మద్యం, బహుమతులు వంటివి ఎంతగా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నా.. ఎప్పటికీ ఓటు విలువ మాత్రం తగ్గేది కాదు.

Huzurabad by-election: సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. హోరెత్తే ప్రచారం!

అయితే, దొంగఓట్లు వేయడం.. ఓటరు ఎన్నికల కేంద్రానికి రాకుండానే మరొకరు ఆ ఓటును దొంగఓటు వేయడం అప్పుడప్పుడు వింటుంటాం. సాధారణంగా అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలలో ఉంటూ ఓటువేసే వ్యక్తి అసలా.. నకిలీనా గుర్తించి ఎన్నికల అధికారులకు చెప్తారు. అయితే.. ఏజెంట్లు అప్రమత్తంగా లేని సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వాళ్ళు దొంగఓట్లకు పాల్పడుతుంటారు.

Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికల్లో అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు

ఒక ఓటరుకు ఒకేసారి ఓటు వేసే హక్కు ఉంటుంది కనుక.. అప్పటికే ఓటరు పేరు మీద మరో వ్యక్తి ఓటు వేసేయడంతో అసలు ఓటరు పోలింగ్ కేంద్రం నుండి వెనుదిరగాల్సి వస్తుంది. కానీ.. నిజానికి అలా వెనుదిరగాల్సిన అవసరం లేదు. రైట్ టు ఓట్ హక్కు ప్రకారం ఛాలెంజింగ్ ఓటు వినియోగించుకోవచ్చు. దానినే మన ఎన్నికల చట్టంలో కండాక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ రూల్స్‌ 1961 సెక్షన్ 49P అంటారు. దీని ప్రకారం ఓటరు తిరిగి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.

Huzurabad By-Election : హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ

మన ఓటు ముందే వేసినట్లు ఓటరు గుర్తిస్తే వెంటనే అక్కడి ప్రిసైడింగ్‌ అధికారికి రూ.5 చెల్లించి చాలెంజ్‌ కోసం ఓటును నమోదు చేయాల్సిందిగా కోరాలి. ఓటరు గుర్తింపుకార్డు తదితరాలన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రిసైడింగ్ అధికారి ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తాడు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈ ఓటును అదనపు ఓటుగా ప్రత్యేకంగా గుర్తిస్తూ చివరిగా లెక్కిస్తారు. గెలుపు ఓటముల్లో ఈ ఓటు కీలకంగా మారితే అవసరాన్ని బట్టి పరిగణలోకి తీసుకుంటారు.