Huzurabad by-election: సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. హోరెత్తే ప్రచారం!

హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ నేతల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులుగా బరిలోకి దిగే పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సామజిక వర్గాల..

Huzurabad by-election: సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. హోరెత్తే ప్రచారం!

Huzurabad By Election

Huzurabad by-election: హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ నేతల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులుగా బరిలోకి దిగే పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సామజిక వర్గాల వారీగా సమావేశాలు.. మండలాల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తున్న నేతలు ఢిల్లీ నుండి గల్లీ వరకు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం ఊపందుకుంటుంది. మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా ఇద్దరినీ టార్గెట్ చేస్తూ హుజురాబాద్ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.

ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోరులో ప్రజలు ధర్మం వైపు నిలుస్తారని చెప్తున్న మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.. ఈ మధ్య రోడ్ షోలో భాగంగా.. పెరిగిన గ్యాస్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుందని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తాజాగా దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌ రావు రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోటీ నుంచి ఈటల తప్పుకోవాలని సవాల్ విసిరారు.

మధ్యలో తానున్నాని గుర్తుచేస్తున్న కాంగ్రెస్.. పార్టీ సీనియర్ నేత వీహెచ్ తో రోడ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వీహెచ్ ఏడేళ్లలో దళితులను టీఆర్ఎస్ మోసం చేసిందని, ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని.. మోసం చేయడం, మాయమాటలు చెప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యని దుయ్యబట్టారు. మరోవైపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులపై నమోదైన కేసుల ఆధారంగా కూడా ప్రచారం నిర్వహించడం మరింత ఆసక్తిగా సాగుతుంది. ఉద్యమంలో తామెంతో పని చేశామని చెప్పుకునేందుకు అభ్యర్థులు ఈ కేసుల ప్రచారం చేసుకుంటున్నారు.

ఈటలే కాదు గెల్లు కూడా ఉద్యమకారుడే అన్న భావన కల్పించే విధంగా టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. లేదు తామే గొప్ప.. కావాలంటే నాపై నమోదైన కేసులను చూసుకోమని ఈటల బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇక, వీరి ప్రచారాన్ని ఆధారం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కూడా తనపై నమోదైన కేసులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తనపై ఉద్యమ కేసులు లేకపోయినా తాను చేసిన పోరాటాలపై నమోదైన కేసులని చెబుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కేసుల ప్రస్తావన తీసుకొస్తూ ప్రచారం చేసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారుతుంది.