MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’లో ఎందుకింత వైరాగ్యం

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (MAA) ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. సభ్యులంతా కలిసి మంచు విష్ణునే 'మా'రాజుని చేశారు. మాలో మేము అంతా ఒక్కటే అంటూనే సాధారణ ఎన్నికలను మించి..

MAA Election: సభ్యత్వానికి రాజీనామా.. ‘మా’లో ఎందుకింత వైరాగ్యం

Maa Election

MAA Election: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (MAA) ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. సభ్యులంతా కలిసి మంచు విష్ణునే ‘మా’రాజుని చేశారు. మాలో మేము అంతా ఒక్కటే అంటూనే సాధారణ ఎన్నికలను మించి ఓ యుద్ధంలా ఈ ఎన్నికలు జరిగాయి. పరస్పరం దాడుల వరకు వెళ్లి ఎందుకో వెనక్కి తగ్గి కౌగిలింతలతో సమసిపోయాయి. రెండు వర్గాలలో ప్యానళ్ల సభ్యులు గెలిచినా అధ్యక్షుడిగా మరోసారి మంచు కుటుంబం దక్కించుకోగలిగింది. ఇక.. ఈ వివాదం.. మా ఎన్నికల హడావుడి ముగిసి అంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారని అనుకున్నారు.

Vikramarkudu 2: దర్శకుడే కాదు హీరో కూడా మార్పు తప్పదా?

కానీ, అనూహ్యంగా ‘మా’ సభ్యత్వానికి రాజీనామాల పర్వం మొదలైంది. ముందుగా మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ ఎన్నికలపై అసంతృప్తి బహిరంగంగానే వెళ్లగక్కుతూ ‘మా’ నుండి బయటకొచ్చేశాడు. ఇందుకు ఆయన చెప్పిన కారణాలు ఆయనకున్నా.. వారు బలపరిచిన ప్రకాష్ రాజ్ ఓటమి చెందడంతో అసంతృప్తితోనే ‘మా’ నుండి తప్పుకున్నాడని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక తాజాగా అధ్యక్షుడిగా పోటీచేసి ఓడిన ప్రకాష్ రాజ్ కూడా ‘మా’ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చాలానే మాట్లాడాడు.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

తనను సభ్యుడిగా కన్నా అతిధిగా ‘మా’ చూసిందని.. అందుకే తాను కూడా ఇకపై అతిధిగానే ఉంటానని చెప్పాడు. అయితే.. తనను సభ్యుడిగా చూసే కదా 300 మందికి పైగా ఓటేసి బలపరిచారు. మరి వాళ్ళ సంగతేంటి? తనకు ఓటేయలేదన్న కోపంతో ఓటేసిన వాళ్ళకి అన్యాయం చేసినట్లే కదా అనే చర్చలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఆయన ప్యానెల్లో గెలిచిన మిగతా వాళ్ళతో పనిచేయించాల్సిన బాధ్యత కూడా ప్రకాష్ రాజ్ పైనే ఉంటుంది. మరి ‘మా’లో నుండి బయటకెళ్తే ఆ బాధ్యత నుండి పక్కకి తప్పుకున్నట్లే కదా.

Monal Gajjar: దేవలోక రంభను మరపించే గుజరాతీ అందం మోనాల్!

ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసినట్లుగా వెళ్లేందుకు ‘మా’ ఏమీ రాజకీయ పార్టీ కాదు. తమ కోసం వాళ్లే నిర్మించుకున్న అసోషియేషన్. అందులో ఓడినంత మాత్రాన సభ్యత్వం వదులుకోవడం అంటే సమంజసం కాదనే చెప్పుకోవాలి. అయితే.. అది వారి ఇష్టమని చెప్పుకోవాలి. ప్రేక్షకులు ఒక సినిమా నచ్చకపోతే.. ఇకపై సినిమాలలో నటించనని చెప్పిన చందంగా ఇలా మా సభ్యుడిగా ఉండేందుకే ఇష్టపడకపోవడం ఆయన మనసులో ఓటమి అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ‘మా’కి అధ్యక్షుడితో పాటు ఎన్నో పదవులను చూసిన నాగబాబు కూడా ఇలా ‘మా’ నుండి బయటకి వెళ్లడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఆయన ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.