Vikramarkudu 2: దర్శకుడే కాదు హీరో కూడా మార్పు తప్పదా?

విక్రం సింగ్ రాథోడ్ గా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో.. అత్తిలి సత్తిబాబుగా ఓ కొంటె దొంగ ఎలా ఉంటాడో చూపించి వసూళ్ల రికార్డులను కొల్లగొట్టాడు దర్శక దిగ్గజం రాజమౌళి.

Vikramarkudu 2: దర్శకుడే కాదు హీరో కూడా మార్పు తప్పదా?

Vikramarkudu 2

Vikramarkudu 2: విక్రం సింగ్ రాథోడ్ గా ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో.. అత్తిలి సత్తిబాబుగా ఓ కొంటె దొంగ ఎలా ఉంటాడో చూపించి వసూళ్ల రికార్డులను కొల్లగొట్టాడు దర్శక దిగ్గజం రాజమౌళి. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే అనుష్క కథానాయికగా సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని విక్రమార్కుడు వచ్చిన కొత్తలోనే అనుకున్నారు. ఆ మేరకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేశారు.

Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

కానీ, ఈ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలతో బిజీ కావడంతో విక్రమార్కుడు లాంటి లోకల్ కథ పక్కకి వెళ్ళింది. అయితే.. ఇప్పుడు రచయిత విజయేంద్రప్రసాద్ ఈ కథకు పూర్తిస్థాయి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు దర్శకుడిగా సంపత్ నంది పేరు కూడా వినిపిస్తుంది. ప్రపంచ స్థాయి సినిమాలతో రాజమౌళి బిజీగా మారడంతో ఈ సీక్వెల్ ను తెరకెక్కించే బాధ్యత సంపత్ నందికి అప్పగించినట్లు తెలుస్తుంది.

Monal Gajjar: దేవలోక రంభను మరపించే గుజరాతీ అందం మోనాల్!

కాగా, దర్శకుడే కాదు హీరో కూడా మారనున్నట్లుగా వినిపిస్తుంది. ఎందుకంటే మాస్ రాజా రవితేజ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ లో ఉంది. ఇవి కాకుండా త్రినాధరావు నక్కినతో మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. మరోవైపు తనకు భద్ర లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటితో మరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. రవితేజ దొరకడం కష్టం కావడంతో ఇప్పుడు మరో హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.