Garuda : కుటుంబానికి రూ.10వేలు.. ఏపీలో మరో కొత్త పథకం

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు సీఎం జగన్. వారందరికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా నిరుపేద

Garuda : కుటుంబానికి రూ.10వేలు.. ఏపీలో మరో కొత్త పథకం

Garuda Scheme

Updated On : October 22, 2021 / 7:35 PM IST

Garuda : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టారు సీఎం జగన్. వారందరికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా నిరుపేద బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. మరో పథకం తీసుకొచ్చారు. అదే గరుడ సహాయ పథకం. ఈ స్కీమ్ కింద నిరుపేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించనుంది.

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..కాల్ కట్ అయినా సులభంగా జాయిన్ కావొచ్చు

ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన 40 రోజులలోపు ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కోసం http://andhrabrahmin.ap.gov.in/ వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఈ నగదు వ్యవహారాలను చూసుకోనుంది.

WhatsApp Chats Leak : వాట్సాప్‌ చాట్ ఎన్‌క్రిప్టెడ్.. సెలబ్రిటీల చాట్స్ ప్రతిసారీ ఎందుకిలా లీక్ అవుతున్నాయంటే?

గరుడ పథకానికి అర్హులు..
* అంత్యక్రియల ఖర్చుల పథకానికి దరఖాస్తు చేయాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి.
* మరణించిన వారి డెత్ సర్టిఫికెట్ ఉండాలి.
* కుటుంబ ఆదాయం రూ.75వేల కంటే ఎక్కువ ఉండకూడదు.
* మరణించిన వారి గుర్తింపు కార్డులు, దరఖాస్తు చేసే కుటుంబ సభ్యులు గుర్తింపు కార్డులు ఉండాలి.
* ఆన్‌లైన్‌లో (www.andhrabrahmin.ap.gov.in) అప్లయ్ చేయాలి.