WhatsApp Chats Leak : వాట్సాప్‌ చాట్ ఎన్‌క్రిప్టెడ్.. సెలబ్రిటీల చాట్స్ ప్రతిసారీ ఎందుకిలా లీక్ అవుతున్నాయంటే?

మెసేంజర్ యాప్ వాట్సాప్ చాట్ భద్రమేనా? యూజర్ల ప్రైవసీ మాటేంటి? వాట్సాప్ చాట్ ఇతరులు ఎవరూ యాక్సస్ చేయలేరంటే.. మరి ఎందుకని ప్రతిసారీ బాలీవుడ్ సెలబ్రిటీల వాట్సాప్ చాట్స్ లీకవుతున్నాయి.

WhatsApp Chats Leak : వాట్సాప్‌ చాట్ ఎన్‌క్రిప్టెడ్.. సెలబ్రిటీల చాట్స్ ప్రతిసారీ ఎందుకిలా లీక్ అవుతున్నాయంటే?

If Whatsapp Chats Are End To End Encrypted Why Do Bollywood Chats Keep Leaking All The Time

Bollywood WhatsApp chats leak: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌‍బుక్ సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ భద్రమేనా? యూజర్ల ప్రైవసీ మాటేంటి? వాట్సాప్ చాట్ ఇతరులు ఎవరూ యాక్సస్ చేయలేరంటే.. మరి ఎందుకిలా ప్రతిసారీ బాలీవుడ్ సెలబ్రిటీల వాట్సాప్ చాట్స్ లీక్ అవుతున్నాయి. WhatsApp చాట్‌లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అని.. యూజర్ తప్ప మరెవరూ చూడలేరు అంటోంది. కానీ, ఇటీవల వాట్సాప్ చాట్ లీకైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవసీపరంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి WhatsApp చెప్పుకొచ్చే మాట ఇదే..

అసలు వాట్సాప్ చాట్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్.. (End-to-end encryption). ఈ విషయం చాలామందికి అర్థంకాక పోవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే.. మెసేజ్ పంపినవారు.. మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మాత్రమే ఆ మెసేజ్ చూడగలరని అర్థం. వారి ప్రమేయం లేకుండా ఇతరులు ఎవరూ ఆ మెసేజ్ చదవలేరు. కానీ, బాలీవుడ్‌లో ప్రతిసారీ, ఎవరో ఒక ప్రముఖుడి WhatsApp చాట్‌లు లీక్ అవుతున్నాయి. వారికి తెలియకుండానే ఈజీగా యాక్సెస్ అవుతున్నాయి. ఇలా బాలీవుడ్ ప్రముఖుల వాట్సాప్ చాట్‌లు లీక్ సందర్భాలు చాలానే ఉన్నాయి.
Cruise Drug Case : ఆర్యన్ ఖాన్.. అనన్య పాండే ‘చాటింగ్’ లీక్.. గంజాయి తెప్పిస్తానన్న నటి

2020 ఏడాదిలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి చెందిన వాట్సాప్ చాట్‌లు ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. డ్రగ్స్ డీలర్‌తో ఆమె చాట్‌లు యాక్సెస్ చేసిన తర్వాత నటి దీపికా పదుకొనే NCB ఆఫీసుకు వరకు వెళ్లాల్సి వచ్చింది. లేటెస్ట్ కేసులో బాలీవుడ్ నటి అనన్య పాండే, షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో చేసిన చాటింగ్‌లు కూడా లీకయ్యాయి. దాంతో NCB  వారికి సమన్లు జారీ చేసింది. ఈ సంఘటనలన్నీ పరిశీలిస్తే.. వాట్సాప్ మెసేజ్‌లు నిజంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయినట్టేనా అనే సందేహం రాకమానదు. చాట్ సెక్యూరిటీ ఉంటే.. చాట్‌లు ఎలా లీక్ అవుతాయి.. ఇతరులు ఎలా ఈజీగా యాక్సస్ చేయగలరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వాట్సాప్ నిజంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్.. నమ్మేదెలా?
WhatsApp మెసేజ్‌లన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటాయని ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది. వాట్సాప్ ప్రకారం.. పంపేవారు.. పొందేవారు తప్ప మరెవరు ఆ మెసేజ్ చూడలేరు.. చదవలేరు.. ఒక్క వాట్సాప్ మాత్రమే కాదు.. ఫేస్‌బుక్ కూడా చూడలేదు. మూడవ వ్యక్తి కూడా ఆ చాట్స్ యాక్సెస్ చేయలేరు. అంత భద్రత ఉంటుంది. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సిగ్నల్ ప్రోటోకాల్‌ ద్వారా ఈ సెక్యూరిటీ ఫీచర్ పనిచేస్తుంది. థర్డ్ పార్టీల ద్వారా వాట్సాప్‌ను మెసేజ్‌లు లేదా కాల్స్ యాక్సెస్ చేయకుండా ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రొటెక్ట్ చేస్తుంది.

దీనిప్రకారం.. వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌ల కంటెంట్‌ని చూడటం సాధ్యపడదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ కాల్స్ కూడా వినడం కుదరదు. ఎందుకంటే దానికి కారణం వాట్సాప్‌లో పంపిన మెసేజ్.. రిసీవర్‌కు మధ్య ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ అనేది పూర్తిగా మీ డివైస్‌లోనే జరుగుతుంది. మెసేజ్ పంపిన వెంటనే అది క్రిప్టోగ్రాఫిక్ లాక్‌ (cryptographic lock)తో మరింత భద్రత కలిగి ఉంటుంది. ఇందులో మెసేజ్ అందుకునే యూజర్ మాత్రమే కీ జనరేట్ అవుతుంది. మీరు పంపిన ప్రతి వాట్సాప్ మెసేజ్ కు ఆటోమాటిక్ గా కీ మారిపోతుంటుంది. ఇదంతా బ్యాక్ గ్రౌండ్ చాట్ లో జరిగిపోతుంటుంది. మీ డివైజ్‌లో సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ ద్వారా వెరిఫై చేసుకోవడం ద్వారా మీ చాట్స్ మొత్తం ప్రొటెక్ట్ చేసినట్టుగా నిర్ధారించవచ్చునని WhatsApp FAQ పేజీ పేర్కొంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ.. చాట్‌లను ఎలా యాక్సెస్ చేయవచ్చు? :
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-end encryption).. ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే మీరు వాట్సాప్ లో ఏయే మెసేజ్ లు పంపుతున్నారో మీకు, మీరు పంపే వారికి మాత్రమే తెలుస్తుంది. అదే గ్రూపులో కూడా సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. వాస్తవానికి ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ డేటాలోకి చొరబడటం అసాధ్యమనే చెప్పాలి. మరి.. WhatsApp చాట్‌లు ఎలా లీక్ అవుతాయి? అన్నదే ప్రశ్న.. వాస్తవవానికి చాలా సందర్భాలలో చాట్స్ లీకవుతున్నాయి. ఎలానంటే.. లీక్ కావడం లేదు.. కానీ, వాట్సాప్ చాట్ యాక్సెస్ చేస్తున్నారు.
Cruise Drug Case : ఆర్యన్ ఖాన్.. అనన్య పాండే ‘చాటింగ్’ లీక్.. గంజాయి తెప్పిస్తానన్న నటి

ఈ యాక్సెస్ కేవలం మీ ఫోన్ Unlock అయినప్పుడు మాత్రమే జరుగుతోంది. ఉదాహరణకు మీతో ఉండేవారిలో ఎవరో ఒకరు మీ ఫోన్ అన్ లాక్ చేసి ఇవ్వమని అడిగినప్పుడు అలాంటి సందర్భాల్లో చాట్స్ ఇతరులు యాక్సస్ చేసుకునే వీలుంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల వంటి పర్సనల్ డివైజ్ యాక్సెసింగ్ విధానం భద్రతపై చట్టాల్లో అస్పష్టత నెలకొంది. అదే అమెరికాలో లేదా ఇతర యూరోపియన్ దేశాలలో ఫోన్‌లు, కంప్యూటర్‌లను సీజ్ చేయాలన్నా, అందులో డేటాను చెక్ చేయాలన్నా ముందుగా పోలీసులకు వారెంట్ అవసరం. ఆ తర్వాతే వాట్సాప్ చాట్ డేటాను యాక్సస్ చేసుకునేందుకు వీలుంది.

– మీ ఫోన్ ఫిజికల్ యాక్సస్ అయి ఉండొచ్చు. మీకు తెలిసినవారు అన్‌లాక్ చేయమని అడిగి ఉండొచ్చు. అలా అన్‌లాక్ చేసిన తర్వాత.. అన్ని చాట్‌లు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్‌షాట్‌లను తీసుకోవచ్చు, వాటిని కాపీ చేయవచ్చు, షేర్ చేయవచ్చు.

– ఫోన్ ఫిజికల్ యాక్సెస్ ఇవ్వలేదు. కానీ అది అన్‌లాక్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఫోరెన్సిక్ బృందాలు టెక్నాలజీ సాయంతో కొంతవరకు యాక్సస్ చేసుకునే వీలుంది. వాట్సాప్ చాట్‌లు ఎన్ క్రిప్టెడ్ అయి ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, కొన్ని వారాల క్రితం వరకు వాట్సాప్ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో చేస్తున్న చాట్ బ్యాకప్‌లు ఎన్‌క్రిప్ట్ చేయలేదు. ఈ చాట్ బ్యాకప్‌లను కొన్ని ప్రత్యేక టూల్స్ ఉపయోగించి యాక్సెస్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా ఫోన్‌ను తీసుకుని అందులోని డేటాను కంప్యూటర్‌కు క్లోన్ చేయవచ్చు. ఆపై ఫోరెన్సిక్ టూల్స్ ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు.

– కోర్టు ఆర్డర్‌తో గూగుల్, ఆపిల్ కంపెనీలను సంప్రదించి వారినుంచి WhatsApp చాట్ బ్యాకప్‌లను (ఎన్ క్రిప్టెడ్ కాకముందు) తెప్పించుకునేందుకు అవకాశం మాత్రం ఉంది. ఇక ఈ బ్యాకప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో అయితే మరోలా యాక్సస్ చేసుకోవచ్చు. చాట్ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్ట్ చేసినప్పుడు.. ఆ ఆప్షన్ యూజర్ ఎనేబుల్ చేయాలి. మీ చాట్ బ్యాకప్‌లను ఎన్ క్రిప్టెడ్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే మీ మెసేజ్ లను ఈజీగా ఇతరులు యాక్సస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు WhatsApp డేటా షేర్ అవుతుందా? :
అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా యూజర్ తమ అకౌంట్ రికార్డులను షేర్ చేయాలంటే.. లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు WhatsAppను సంప్రదించవచ్చు. ఏదైనా అకౌంట్లోని స్టోర్ కంటెంట్‌లలో డేటాను యాక్సస్ చేసేందుకు అనుమతి కోరవచ్చు. వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలు, సమగ్ర డేటా అందుబాటులో ఉండే ఉండవచ్చు. లేదంటే డిలీట్ అయిపోవచ్చు. వారి అభ్యర్థనను వాట్సాప్ వంటి కంపెనీలు సంబంధిత చట్టాల ఆధారంగా యూజర్ డేటాను ఎంతవరకు ఇవ్వవచ్చు అనేది రివ్యూ చేస్తాయి. అది కూడా వారికి సమ్మతమైతే తప్పా.. యూజర్ ప్రైవసీ డేటాను షేర్ చేసేందుకు అంగీకరించవు.

WhatsApp FAQ పేజీలో కూడా మెసేజింగ్ యాప్ యూజర్ల కంటెంట్ అధికారులతో షేర్ చేస్తుందని ఎక్కడా పేర్కొనలేదు. వాట్సాప్ మెసేజ్ ఒకసారి డెలివరీ అయిన తర్వాత లేదా ఆ మెసేజ్‌ల లావాదేవీ లాగ్‌లను వాట్సాప్ స్టోర్ చేయదు. అందుకే డేటాను గుర్తించడం కష్టం. ఎందుకంటే.. వాట్సాప్ చాట్ లో మెసేజ్ లు డెలివరీ అయిన 30 రోజుల తర్వాత వాట్సాప్ సర్వర్‌ల నుంచి డిలీట్ అయిపోతాయి. ఇది డిఫాల్ట్‌గా యాక్టివేట్ అయి ఉంటుంది. అలాగే ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ కూడా.. WhatsApp యూజర్ల చాట్‌లను యాక్సెస్ చేసేందుకు అసలే అనుమతించదు.
America Fail : చైనా సక్సెస్‌..అమెరికా ఫెయిల్‌…యూఎస్ ప్రయోగించిన మిస్సైల్‌ అట్టర్‌ఫ్లాప్‌