America Fail : చైనా సక్సెస్‌..అమెరికా ఫెయిల్‌…యూఎస్ ప్రయోగించిన మిస్సైల్‌ అట్టర్‌ఫ్లాప్‌

చైనా గెలిచింది.. అమెరికా ఓడింది. అగ్రరాజ్యంగా ఎదగాలని కలలుగంటున్న చైనా అమెరికాపై పైచేయి సాధించింది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వెయ్యాలని భావించిన అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

America Fail : చైనా సక్సెస్‌..అమెరికా ఫెయిల్‌…యూఎస్ ప్రయోగించిన మిస్సైల్‌ అట్టర్‌ఫ్లాప్‌

America Fail

US hypersonic missile Utterflop : చైనా గెలిచింది.. అమెరికా ఓడింది.. అగ్రరాజ్యంగా ఎదగాలని కలలుగంటున్న చైనా.. అమెరికాపై పైచేయి సాధించింది. అటు చైనా దూకుడుకు అడ్డుకట్ట వెయ్యాలని భావించిన అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవును అమెరికా ప్రయోగించిన హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. గత ఆగస్టులో చైనా పరీక్షించిన హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ అంచనాలను అందుకుంది. అఖరి మెట్టుపై కాస్త గురితప్పినా…. అనుకున్నదాని కంటే ఎక్కువే సాధించడంతో పెంటగాన్ షాక్ తిన్నది. చైనా చేసిన ఈ సీక్రెట్‌ ప్రయోగం నాలుగు రోజుల ముందే లీక్‌ అయింది.

ఇది అమెరికాతో పాటు ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేసింది. చైనా మిస్సైల్‌పై స్పందించేందుకు నిరాకరించిన అమెరికా.. మాటల్లో కాకుండా చేతల్లో సత్తా చాటాలని భావించింది. అయితే అనుకున్నది ఒకటి ఐనదొకటి అన్నట్లు హైపర్‌ సోనిక్‌ రేస్‌లో అమెరికా ఓటమిపాలైంది. ఆరంభంలోనే అది ప్లాపైంది. శత్రుదేశాలైన రష్యా, ఉత్తరకొరియా విజయాలు సాధించిన నెలరోజుల్లోపే బైడెన్‌ సర్కార్‌కు దారుణ పరాభవం ఎదురైంది. ఒక వైపు 21వ శతాబ్దంలో సూపర్ పవర్‌గా చైనా ఎదుగుతుండగా… మరోవైపు అమెరికా మెల్లమెల్లగా దశాబ్దాల ఆధిపత్యాన్ని కోల్పోతోంది.

FATF’s Grey List : ఇమ్రాన్ ఖాన్ కు కొత్త తలనొప్పి..”గ్రే”జాబితాలోనే పాకిస్తాన్

ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన చైనా.. ఇటివల కాలంలో ప్రతివిషయంలోనూ అమెరికాపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. కృత్రిమ మేధ పోరులో కూడా అమెరికాపై చైనాదే పైచేయి. ఏళ్ల తరబడి అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాను తలదన్నేలా చైనా ఆధిపత్యం చెలాయిస్తూ ఉండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా రచిస్తున్న వ్యూహాలన్ని బెడిసికొడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ ప్రయోగంలో అమెరికా ఫెయిల్‌ అవ్వడం.

అదే సమయంలో చైనా ఒకటి కాదు ఏకంగా రెండు హైపర్ సోనిక్‌ మిస్సైల్స్‌ను ప్రయోగించిందంటూ వచ్చిన వార్త పెంటగాన్‌ను కుదిపేస్తోంది. గత ఆగస్టులో చైనా హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించదంటూ కథనాలు వెలువడి నాలుగు రోజులు గడవకముందే.. చైనా చేసిన మరో రహస్య ప్రయోగం గుట్టు వీడింది. గత జూన్‌లోనే చైనా హైపర్‌ సోనిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించిందట..! అసలు గుట్టు చప్పుడు చైనా ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తున్నట్లు అన్న కలవరం అమెరికా అధికారుల్లో కనిపిస్తోంది.

Satyapal Malik : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..రెండు ఫైల్స్ పై సంతకం పెడితే రూ.300కోట్లు ఇస్తామన్నారు

యుద్ధం వస్తే అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకే చైనా మిస్సైల్స్‌ను ప్రయోగిస్తుందన్నది విశ్లేషకుల మాట.. అటు అమెరికాపై చైనా ఆధిపత్యాన్ని గమనిస్తోన్న రష్యా, ఉత్తరకొరియాలు కూడా సైలెంట్‌గా మిస్సైల్స్‌ ప్రయోగాలు చేయడం అమెరికాకు మింగుడు పడడంలేదు. ఇలా వరుసపెట్టి అమెరికా శత్రువులు మిస్సైల్స్‌లో దూసుకుపోవడం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది.