FATF’s Grey List : ఇమ్రాన్ ఖాన్ కు కొత్త తలనొప్పి..”గ్రే”జాబితాలోనే పాకిస్తాన్

  అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్తాన్​కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో వర్చవల్​గా నిర్వహించిన మూడురోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్

FATF’s Grey List : ఇమ్రాన్ ఖాన్ కు కొత్త తలనొప్పి..”గ్రే”జాబితాలోనే పాకిస్తాన్

Imran

FATF Grey List    అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్తాన్​కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిర్వహించిన మూడురోజుల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) సమావేశంలో పాకిస్తాన్‌ను ఏప్రిల్ 2022 వరకు గ్రే లిస్ట్‌లోనే ఉంచాలని నిర్ణయించారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం.. మనీ లాండరింగ్‌ను ఆపడంలో విఫలమైన కారణంగా పాకిస్తాన్ ను ఈ జాబితాలో చేర్చారు.

జూన్ 2021 లో, పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచాలని ఎఫ్ఏటీఎఫ్(FATF) నిర్ణయించింది. ఆ సమయంలో పాకిస్తాన్ 3 నుండి 4 నెలల్లో అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పింది. అయితే నిర్దేశించిన 34 విధుల్లో 30 విధులను మాత్రమే పాకిస్తాన్ నిర్వర్తించినందున ప్లీనరీ సమావేశంలో పాక్ ను గ్రే లిస్ట్ లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ గురువారం తెలిపారు.

పాకిస్తాన్​ ఇప్పటివరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా కీలకమైన చర్యలు చేపట్టిందని ఎఫ్​ఏటీఎఫ్​ తెలిపింది. అయితే ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్​ సయీద్, మసూద్ అజర్ సహా వారి బృందాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను పాక్​ మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఎఫ్​ఏటీఎఫ్​ తెలిపింది. 2008 సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్, ఆ తర్వాత 2016 లో పఠాన్‌కోట్‌లో, 2019 లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడులకు మసూద్ అజర్ సూత్రధారి .

మరోవైపు, గ్రే లిస్ట్ నుంచి మారిషస్, బోట్స్వానా దేశాలను తాజాగా ఎఫ్​ఏటీఎఫ్​ తొలిగించింది. ఈ నేపథ్యంలో ఆ దేశాలకు ఎఫ్​ఏటీఎఫ్​ అధ్యక్షుడు మార్కస్ ప్లీయర్ అభినందనలు తెలిపారు. జోర్డాన్​, మాలీ, టర్కీ దేశాలను తమ జాబితాలో చేర్చుతున్నట్లు ఎఫ్​ఏటీఎఫ్ తెలిపింది. ఈ మూడు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కార్యచరణ చేపట్టడానికి అంగీకరించాయని చెప్పింది

గ్రే లిస్ట్,బ్లాక్ లిస్ట్ అంటే ఏంటీ
టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ వంటి విషయాలకు పాల్పడినవి లేదా అటువంటి చర్యలకు సహాయంగా నిలుస్తున్నాయని అనుమానిస్తున్న దేశాలను ఈ జాబితాలో ఉంచుతారు. ఈ దేశాలకు పని చేయడానికి షరతులతో కూడిన అవకాశం ఇస్తారు. దీనిని నిత్యం పర్యవేక్షిస్తారు. గ్రే లిస్ట్‌లో ఉన్న దేశాలు.. ఏదైనా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ లేదా దేశం నుండి రుణాలు తీసుకునే ముందు చాలా కఠినమైన షరతులను పాటించాలి. చాలా సంస్థలు రుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపవు. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా సమస్యలు ఉంటాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యూరోపియన్ యూనియన్ నుండి ఆర్థిక సహాయం పొందడంలో పాకిస్తాన్ ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరోసారి పాకిస్థాన్‌ని గ్రే లిస్ట్‌లో కొనసాగించడం వల్ల ఆ దేశ సమస్యలు మరింతగా పెరుగుతాయి.

కాగా, మొదటిసారిగా పాకిస్తాన్ ను జూన్ 2018 లో ఈ జాబితాలో చేర్చారు. అప్పటి నుండి పాక్ ఈ జాబితా నుండి బయటకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించింది. ప్రతిసారీ విఫలమావుతూనే వస్తోంది. గ్రే లిస్టు నుంచి బయటపడటానికి గాను 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) పాకిస్తాన్‌కు ఇచ్చింది. వాస్తవానికి పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ కార్యాచరణ ప్రణాళికపై అక్టోబర్ 2019 నాటికి చర్యలు తీసుకోవలసి ఉంది. కానీ అది అలా చేయలేదు. దీంతో ఈ ప్లాన్‌కు మరో 6 పాయింట్లు జోడించారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ 4 పాయింట్లలో విఫలమవుతుంది. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థల నాయకులపై దర్యాప్తు తో సహా ఇతర ఉగ్రవాద సంబంధిత విషయాలపై పాకిస్తాన్ ఎలాంటి చర్య తీసుకోలేకపోయింది.

అయితే.. టర్కీ, మలేషియా, చైనా కారణంగా పాకిస్తాన్ బ్లాక్ లిస్టు లోకి చేరకుండా ఆగింది. ఇది పాకిస్తాన్‌కు ఉపశమనం కలిగించే విషయం. ఏదైనా దేశం టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్‌ని ఎదుర్కొంటోందని.. అది వారిని నియంత్రించడం లేదని రుజువు అయినప్పుడు ఆ దేశం బ్లాక్ లిస్ట్‌లో చేర్చబడుతుంది. బ్లాక్ లిస్ట్ లోకి వెళితే..ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అంచుకు చేరుకుంటుంది. IMF, వరల్డ్ బ్యాంక్ లేదా ఏదైనా ఆర్థిక సంస్థ కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్న దేశాలకు ఆర్థిక సహాయం అందించదు. బహుళ జాతీయ కంపెనీలు వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంటాయి. రేటింగ్ ఏజెన్సీలు ప్రతికూల జాబితాలో ఉంటాయి.

ALSO READ  దేశానికి వచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారట..!