Pakistan Pm Imran selling gifts : దేశానికి వచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారట..!

పాకిస్థాన్ దేశానికి ఇతర దేశాల అధినేతలు ఇచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారని ఆ డబ్బుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.

Pakistan Pm Imran selling gifts : దేశానికి వచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారట..!

Imran Khan Selling Gifts

Pakistan Pm Imran Khan Imran Khan selling gifts : దేశ ప్రధానిగా ఉన్నాసరే..దేశానికి వచ్చిన బహుమతులు దేశానికే సొంతం. అవి చరిత్రలో ఉండిపోతాయి. కానీ అలాకాకుండా ప్రధానిగా ఉన్నాను కదాని దేశానికి వచ్చిన బహుమతులను అమ్మేసుకోవటానికి హక్కు ఉండదనే విషయం తెలిసిందే. ఇదంతా ఎందుకు? అంటే పాకిస్థాన్ దేశానికి వచ్చే బహుమతులను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారని ప్రతిపక్షాల నేత సంచలన ఆరోపణలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎంత వరకు నిజం? నిజంగానే ఇమ్రాన్ ఖాన్ అలా చేస్తున్నారా? అంటే నిజమేనని..దేశానికి వచ్చే గిఫ్టుల్ని అమ్మించి ఆ డబ్బుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారని..ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more : Pakista PM : తాలిబ‌న్లు సామాన్య పౌరులే : ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇతర దేశాల నుంచి అందుకున్న ఓ విలువైన బహుమతిని తన సన్నిహితుడి ద్వారా అమ్మించిన ఆ డబ్బులను తన సొంత ఖాతాలో జమ చేసుకున్నారనే వాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ బహుమతిని రూ. 7.4 కోట్లకు అమ్మారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 1 మిలియన్ డాలర్ల విలువైన ఖరీదైన వాచ్‌తో సహా ఇతర దేశాల తలల నుండి అందుకున్న బహుమతులను ఇమ్రాన్ ఖాన్ అమ్మించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కాగా.. ఒక దేశం మరొక దేశానికి బహుమతులు ఇస్తే.. గిఫ్ట్ డిపాజిటరీ (తోషాఖానా) నిబంధనల ప్రకారం..అవి ఆ దేశానికి చెందిన ఆస్తులుగా భావిస్తారు. గౌరవంగా భావిస్తారు. ఒకవేళ వాటిని అమ్మాలనుకుంటే బహిరంగ వేలంలో విక్రయించాలి. కానీ ఇమ్రాన్ ఖాన్‌ అలా చేయకుండా పాకిస్తాన్ దేశానికి గల్ఫ్ దేశ యువరాజు 1 మిలియన్ డాలర్ల విలువైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడని దానిని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు దుబాయ్‌లో అమ్మేశాడని..అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఇమ్రాన్ ఖాన్ ఖాతాలో వేసుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ విషయం గిప్ట్ ఇచ్చిన యువరాజుకు కూడా తెలుసంటూ ప్రచారం సాగుతోంది.

Read more : Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

ఇతర దేశాల నుంచి అటువంటి గిఫ్ట్స్ ను అందుకున్న ‘ఇమ్రాన్ ఖాన్ వాటిని విక్రయించారని పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) ఉపాధ్యక్షురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ట్వీట్ చేశారు. గిఫ్ట్ డిపాజిటరీ నుంచి విదేశీ బహుమతులను దోచుకుంటున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పంజాబ్ అధ్యక్షుడు రాణా సనావుల్లా ఇతర దేశాల అధిపతుల అందుకున్న బహుమతులను విక్రయించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పరువు తీశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.దేశానికి ప్రధానిగా ఉంటూ ఇమ్రాన్ ఖాన్ ఇలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.

అలాగే..పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) పంజాబ్ అధ్యక్షుడు రాణా సనావుల్లా బుధవారం (అక్టోబర్ 20,2021) విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇతర దేశాల అధిపతుల నుండి అందుకున్న బహుమతులను విక్రయించి..ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పరువు తీశారంటూ మండిపడ్డారు.కాగా గత నెలలో..పాకిస్తాన్ ప్రభుత్వం పలు దేశాలకు చెందిన అధినేతలు పాక్ ప్రధానికి ఇచ్చిన బహుమతుల గురించి బహిరంగంగా తెలియజేయడానికి నిరాకరించింది. పాకిస్తాన్ సమాచార కమిషన్ వివరాలు కోరిన అనంతరం ఈ ప్రకటన దేశ జాతీయ ప్రయోజనాన్ని, ఇతర రాష్ట్రాలతో దాని సంబంధాలను దెబ్బతీస్తుందని నొక్కి తెలిపింది.

Read more : Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం