ఐదేళ్ల చిన్నారి మర్డర్ కేసులో తల్లి వివాహేతర సంబంధమే కారణమా..

మేడ్చల్ జిల్లాలో జరిగిన అభంశుభం తెలియని చిన్నారి ఆద్య హత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ మర్డర్ కేసులో ఇప్పటికే నిందితుడు కరుణాకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… నిందితుడి నుంచి కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే, ఇస్మాయిల్‌ఖాన్ గూడ విహారి హోమ్స్‌లో దారుణ హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి ఆద్య అంత్యక్రియలు భువనగిరిలో జరిగాయి. అంతకుముందు ఉస్మానియా ఆస్పత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. పోస్టుమార్టం కొంత ఆలస్యం జరిగింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆద్య తల్లి అనూషనూ పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆద్య మర్డర్ సమయంలో అనూష ఇంట్లోనే ఉన్న ఆమె స్నేహితుడు రాజశేఖర్‌ను సైతం పోలీసులు విచారించారు. స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేశారు. ఈ కేసులో హత్యకు గల ప్రధాన కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, నిందితుడి కాల్‌డేటా.. వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు కరుణాకర్.. కీలక అంశాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన అనూష. తనతో చాలా చనువుగా ఉండేదని… ఆమె కోసం తాను ఆర్థికంగా సాయం చేశానని కరుణాకర్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.తనతో ఎంతో చనువుగా ఉండే అనూష.. కొద్దిరోజులుగా దూరం పెడుతోందని … మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని పోలీసులకు తెలిపాడు.
తన ఫోన్ కాల్స్‌ను సైతం లిఫ్ట్ చేయకుండా దూరంపెట్టినట్టు వివరించాడు. చిన్నారి ఆద్యను ఎందుకు చంపాల్సి వచ్చిందనే దానిపై మాత్రం నిందితుడు ఒక్కోసారి ఒక్కోరకంగా చెబుతున్నట్టు తెలుస్తోంది. అనూషను అడగటానికే అక్కడికి వచ్చానని… తను మరో గదిలోకి వెళ్లి తాళం వేసుకోవడంతో.. ఏం చేయాలో తోచలేదని తెలిపాడు. ఆమెను బయటికి రప్పించడానికి చిన్నారిని ఆవేశంలో హత్య చేసినట్టుగా కరుణాకర్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.
తల్లి అనూష చేసిన తప్పిదాలే చిన్నారి ఆద్య ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆద్య మర్డర్‌కు తల్లి అనూష వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Read:కరోనా మందు ఇస్తామని తీసుకెళ్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం..