Airbus Beluga HYDAirport
Airbus Beluga – HYDAirport: నీలి సముద్రాల్లో తిమింగలాలు (Whales) తిరుగుతుంటాయి. భారీ పొడవు, టన్నుల కొద్దీ బరువుతో ఉండే తిమింగలాల కళేబరాలు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకు వస్తుంటే చూస్తుంటా. అయితే, ఆకాశంలో తిరిగే తిమింగలాన్ని ఎప్పుడైనా చూశారా? ఇదిగో చూడండంటూ ఈ ఫొటోలను పోస్ట్ చేసింది హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport).
Airbus Beluga HYDAirport
ఆకాశ తిమింగలం తమ విమానాశ్రయ రన్‌వేపైకు వచ్చిందని తెలిపింది. తిమింగలం ఆకారంలో ఉండే ఎయిర్ బస్ బెలుగా ఇది. దీన్ని భారీ వస్తువుల రవాణాకు వాడతారు. గతంలోనూ ఇది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనపడింది.
Airbus Beluga HYDAirport
ఎయిర్‌బస్ ట్రాన్స్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఉపయోగించే ఈ కార్గో విమానాలు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 మాత్రమే ఉన్నాయి. 1995 నుంచి ఈ విమానాన్ని వాడుతున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఆకాశపు తిమింగలం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అచ్చం తిమింగలంలాగే దీని రూపు ఉందని నెటిజన్లు అంటున్నారు.
Beluga spotted at #HYDAirport, yet again! We are thrilled to host the whale of the sky on our runway as it delivers some mighty special cargo.#FlyHYD #AirbusBeluga #Aircraft #Airport pic.twitter.com/VpUcQlnkn0
— RGIA Hyderabad (@RGIAHyd) August 2, 2023