బెట్టింగ్‌ యాప్ కేసులో ఈడీ దూకుడు.. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్‌సహా 29మంది సెలెబ్రిటీలపై కేసు..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఎంటరైంది.

Betting App Case

Betting App Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఎంటరైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి బాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానాలతో పాటు మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి సహా 29మంది సెలెబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది.

చట్టవిరుద్ధ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు భారీగా కమీషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్‌ల కారణంగా అప్పులపాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణు ప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలెబ్రిటీలు దగ్గుబాటి రానాతో పాటు మంచు లక్ష్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత‌, నిధి అగర్వాల్‌, శ్రీముఖి, రీతూ చౌద‌రి, యాంక‌ర్ శ్యామ‌ల‌, అనన్య నాగళ్ల త‌దిత‌రులపై ఈడీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ఇక సోష‌ల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లల‌లో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ల పైకూడా ఈడీ కేసు నమోదు చేసింది.

ఈడీ కేసు నమోదుచేసింది వీరిపైనే..
రానా దగ్గుబాటి
ప్రకాష్ రాజ్
విజయ్ దేవరకొండ
మంచు లక్ష్మి
ప్రణీత
నిధి అగర్వాల్
అనన్య నాగెళ్ల
సిరి హనుమంతు
శ్రీముఖి
వర్షిణి సౌందరరాజన్
వాసంతి కృష్ణన్
శోభా శెట్టి
అమృత చౌదరి
నయని పావని
నేహా పఠాన్
పాండు
పద్మావతి
ఇమ్రాన్ ఖాన్
విష్ణు ప్రియ
హర్ష సాయి
బయ్యా సన్నీ యాదవ్
శ్యామల
టేస్టీ తేజ
రీతు చౌదరి
బండారు శేషాయని సుప్రీత
బెట్టింగ్ యాప్‌ల నిర్వహణ
కిరణ్ గౌడ్
అజయ్, సన్నీ, సుధీర్ (సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు)
యూట్యూబ్ చానెల్ ‘లోకల్ బాయ్ నాని’