Bhoiguda : గోదాముల్లో నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు

ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాములను గుర్తించాలన్నామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో కూలీలు ఉండకుండా ఇతర ఏర్పాట్లు చేయాలని, కూలీలకు వసతి యజమానులు కల్పించాలని...

Bhoiguda Fire Accident : సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం కావడంపై దేశ వ్యాప్తంగా అందర్నీ కలిచివేసింది. బీహార్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక పని చేస్తున్న వారు విగతజీవులుగా మారడంపై విషాదం నింపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. చనిపోయిన వారి కుటుంబీకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని సీఎం కేసీఆర్ తెలిపారు. ఘటనాస్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్ లు సందర్శించారు. అనంతరం దీనిపై రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు హోం మంత్రి మహమూద్ అలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More : Bhoiguda Accident : బుగ్గిపాలైన 11 మంది కార్మికులు.. 12 వేల జీతం కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి…

జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకమని, ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయినట్లు తెలిపారు. పోలీస్, జీహచ్ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు… ఎక్కడెక్కడ ఇలాంటి గోదాముల్లో ఎంతమంది పని చేస్తున్నారో వివరాలు సేకరించాలని ఆదేశం ఇవ్వడం జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు, ప్రజల మధ్య ఉన్న ఇలాంటి గోదాములను గుర్తించాలన్నామన్నారు. గోదాములలో రాత్రి వేళల్లో కూలీలు ఉండకుండా ఇతర ఏర్పాట్లు చేయాలని, కూలీలకు వసతి యజమానులు కల్పించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యిందని, 2022, మార్చి 24వ తేదీ గురువారం ఉదయం మృతదేహాలను వారి వారి స్వస్థలానికి తరలిస్తామన్నారు. గోదాముల్లో నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు హో మంత్రి మహమూద్ అలీ.

ట్రెండింగ్ వార్తలు